మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశ గణతంత్రానికి ప్రజాస్వామ్యం , న్యాయం , స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతత్వం పునాదుల వంటివని కృష్ణాజిల్లా అన్ని రంగాల్లో గణనీయంగా అభివృద్ది చెందిందని జిల్లా కలెక్టర్ జె. నివాస్ పేర్కొన్నారు. 73 వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు మచిలీపట్నం ఏఆర్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఘనం గా మంగళవారం ఉదయం జరిగాయి. కృష్ణాజిల్లా కలెక్టరు జె .నివాస్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశిల్ తో కలిసి పెరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో వివిధ ప్లాటూన్ వారిగా ల గౌరవ వందనాన్ని స్వీకరించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నిర్వహించిన కార్యక్రమాలు ఆహుతులను ఆద్యంతం ఆకట్టుకున్నాయి. సిబ్బంది పెరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శన వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అనంతరం కలెక్టర్ జె. నివాస్ ప్రజల నుద్దేశించి గణతంత్ర దినోత్సవ సందేశాన్ని చదివి వినిపించారు .ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం ద్వారా భారత రాజ్యాంగం పట్ల ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి రాజ్యాంగ హక్కుల పట్ల ప్రతి ఒక్కరికి పరిరక్షణ గా తెలియచేసే ఒక పర్వదినమన్నారు. కోవిడ్ మహమ్మారి సోకి మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు అలుపెరగని. పోరాటాన్ని సాగిస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీస్ సిబ్బంది సంబంధిత శాఖల సిబ్బందికి కూడా ప్రత్యేకంగా అభినందనలు కలెక్టర్ తెలియచేసారు .వ్యాక్సినేషన్ ద్వారానే కోవిడ్ ను అరికట్టగలమనే లక్ష్యంతో జిల్లాలో నూరుశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నామన్నారు . జిల్లాలో ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు, వైద్య సిబ్బంది, 60 ఏళ్ల పైబడ్డ వృద్ధులు 22 వేల మందికి బూస్టర్ డోస్ అందించాం. 15-17 సంవత్సరాల లోపు వయస్సు గల 1,98,280 మంది నవ యువతకు వ్యాక్సిన్ ఇచ్చామన్నారు.
కోవిడ్ మూడవ దశ నేపథ్యంలో కోవిడ్, ఒమిక్రాన్ వ్యాప్తిని దీటుగా, మరింత సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు తగిన ఏర్పాట్లతో జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉందని వివరించారు . కృష్ణాజిల్లాలో 16 కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేశామని ఇందుకు గాను 2000 బెడ్లు సిద్ధం చేశామన్నారు .అక్కడ వైద్యాధికారులు, సిబ్బందిని నియమించన్నారు. జిల్లాలో ప్రతి రోజు సుమారు 10 వేల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, కోవిడ్ సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ అందక కుటుంబ భారాన్ని మోస్తున్న ప్రధాన వ్యక్తులు ఎంతోమందిని కోల్పోయామని ఆ దుస్థితి తిరిగి రాకూడదనే ప్రభుత్వ 09 ఆసుపత్రుల్లో అత్యాధునిక ఆక్సిజన్ సౌకర్యాల కల్పనలో భాగంగా జిల్లాలో 9,007 ఎల్.పి.ఎం. సామర్థ్యం గల 15 ఆక్సిజన్ ప్లాంట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఒమిక్రాన్ వైరస్ నిర్ధారణ కోసం దేశంలో కేరళ తరువాత మన రాష్ట్రంలో మొట్టమొదటిగా విజయవాడలో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటు చేసిందన్నారు. కోవిడ్ తో మరణించిన కుటుంబాలకు 50 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించామని, 3,930 దరఖాస్తులు రాగా 3,123 మందికి 50 వేల రూపాయలు మంజూరు చేశామని తెలిపారు మిగిలిన దరఖాస్తులు పురోగతిలో ఉన్నాయిన్నారు. వారికి కూడా త్వరలో ప్రభుత్వ సహాయం అందుతుందని కలెక్టర్ అన్నారు. ఐసిడిఎస్ ద్వారా కోవిడ్ తో మరణించిన వారి కుటుంబాలలో అనాధలైన 23 మంది చిన్నారులకు ఒక్కొక్కరికి 10లక్షల రూపాయల చొప్పున 2.30 కోట్ల రూపాయల ఎక్స్ గ్రేషియ అందించామన్నారు .
వాస్తవమైన అభివృద్ధి విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లోనే ఉందని ప్రభుత్వం గట్టిగా నమ్ముతోందని అందుకే జిల్లాలో వైద్య రంగాన్ని సమూలంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు . జిల్లాలో నాడు- నేడు పథకం కింద 18.35 కోట్ల రూపాయలతో 10 ఆరోగ్య కేంద్రాలకు నూతన భవనాలు నిర్మిస్తున్నామని వివరించారు. అలాగే మరో 80 ప్రాథమిక వైద్య కేంద్రాలలో 28.52 కోట్ల రూపాయలతో ఆధునిక వైద్య వసతులు అభివృద్ధి పరుస్తున్నామన్నారు . పి హెచ్ సి లలోనే ఆరోగ్య పరీక్షలు చేసుకొనే అవకాశం సమకూరుతుందన్నారు మచిలీపట్నంలో 550 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ మంజూరు అయ్యిందన్నారు . భవన నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతుందన్నారు .
అలాగే పేదలందరికి నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందజేయడమే డా. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ముఖ్య ఉద్దేశ్యమని , వైద్యం ఖర్చు 1000 రూపాయలు దాటిన 1,381 నూతన చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చి మొత్తం 2,440 చికిత్సలకు ఉచిత వైద్యం అందిస్తున్నామన్నారు. . జిల్లాలో ఇప్పటి వరకు 1.18 లక్షల మంది రోగులకు 463 కోట్ల రూపాయలతో ఉచితంగా వైద్య సేవలు అందించడం జరిగిందన్నారు.
జిల్లాలో అవ్వా, తాతలకు ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని జనవరి 1వ తేదీ నుండి 2250 నుండి 2500 రూపాయలకు పెంచామన్నారు. జిల్లాలో 5 లక్షల 27 వేల 146 మందికి 134 కోట్ల రూపాయలను పెన్షన్లుగా అందిస్తున్నామన్నారు. వై.ఎస్.ఆర్ ఆసరా పధకం ద్వారా జిల్లాలోని 57 వేల గ్రూపులకు రెండు విడతల్లో 1042 కోట్ల రూపాయలు, పట్టాన ప్రాంతాలల్లో 7 వేల 500 గ్రూపులకు రెండు విడతలల్లో 137 కోట్ల రూపాయలు నేరుగా జమ చేశామన్నారు. జగనన్న తోడు పధకం కింద 24 వేల మంది చిరు వ్యాపారులకు 48 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు మంజూరు చేసాం.. జగనన్న గృహ నిర్మాణ పధకం కింద జిల్లాలో 3 వేల 838 కోట్ల రూపాయలతో 2 లక్షల 13 వేల 231 మంది లబ్దిదారులకు గృహాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇప్పటివరకు ఇళ్ళు నిర్మించుకున్న లబ్ధిదారుల ఖాతాలకు 82 కోట్ల రూపాయలు జమచేశామన్నారు. జగనన్న కాలనీలలో 4002 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం కింద జిల్లాలో 2. 79 లక్షల మంది లబ్ధిదారులు అర్హులుగా గుర్తించామని, వారిలో నగదు చెల్లించిన 81 వేల 733 మంది లబ్దిదారులకు ఇళ్ల స్థల పట్టాలు అందించడం జరిగిందన్నారు.
మనబడి నాడు-నేడు కారక్రమం కింద జిల్లాలో మొదటి విడతలో 1121 పాఠశాల్లో 272 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. . అమ్మఒడి పధకం కింద జిల్లాలోని 3. 76 లక్షల మంది తల్లుల ఖాతాల్లో 15 వేల రూపాయల చొప్పున 564 కోట్ల రూపాయలు జమ చేసామన్నారు. . వై.ఎస్.ఆర్. రైతు భరోసా కింద జిల్లాలో ఇంతవరకు 3. 26 లక్షల మంది రైతులకు 935 కోట్ల రూపాయలు అందించామన్నారు. 5 . 12 లక్షల మంది రైతులకు 8 వేల 78 కోట్ల రూపాయలు పంట రుణాలుగా అందించామన్నారు. పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి జిల్లాలో జగనన్న పాల వెల్లువ కారక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు.
నిరుపేద కుటుంబాల నుంచి వచ్చే బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ప్రభుత్వ హాస్టళ్లల్లో, కార్పొరేట్ కు ధీటుగా వసతులు కల్పించాలని “మార్పు” కార్యక్రమం చేపట్టామని, జిల్లాలోని ప్రభుత్వ హాస్టళ్లన్నింటిని “మార్పు ” కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) కృష్ణా జిల్లా జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హరిక, జిల్లా ఎస్పీ సిద్దార్ధ కౌశిల్ , జాయింట్ కలెక్టర్ డాక్టర్ మాధవిలత, జాయింట్ కలెక్టర్ 2 శివశంకర్, ఆసరా జె సి కె. మోహన్ కుమార్, హోసింగ్ జె సి శ్రీవాస్ నుపుర్ అజయ్ కుమార్, మచిలీపట్నం ఆర్డీవో ఎన్. ఎస్.కె. ఖాజావలి, జిల్లా ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
ప్రభుత్వ శాఖలకు ఆర్టీజీఎస్ సాంకేతిక సహకారం
-తద్వారా వాటి పనితీరు మెరుగుపరుద్దాం -సీఎం ఆశయాలకనుగుణంగా పనిచేయాలి -యూస్ కేసెస్‌ను త్వరితగతిన అమల్లోకి తీసుకొచ్చేలా పనిచేయండి -త్వరలో అందుబాటులోకి …