విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఒమిక్రాన్ రూపంలో థర్డ్ వేవ్ గా తిరిగి విస్త్రుతంగా కోవిడ్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దాని యొక్క నివారణ మరియు నియంత్రణ కొరకు ఆయుష్ వైద్య విధానాల ద్వారా విశేషంగా కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వ ఆయుష్ శాఖ వారు రాష్ట్ర ప్రభుత్వాలకి లేఖ రాయడం జరిగింది. దీనికి అనుగుణంగా ఆయుష్ వైద్య విధానాలైన ఆయుర్వేద హోమియోపతి యోగ యునాని వైద్యవిధానాలపై ప్రజలలో విశేషంగా అవగాహన కలిపించి ఈ చికిత్సా ప్రక్రియలను జన బాహుళ్యంలోకి తీసుకొని వెళ్ళి తద్వారా కోవిడ్ మరియు ఒమిక్రాల నియంత్రణకు పాటు పడాలని రాష్ట్ర ప్రభుత్వ ఆయుష్ శాఖ సంకల్పించినట్లు రాష్ట్ర ఆయుష్ కమీషనర్ కల్నల్ వి. రాములు తెలిపారు. ఈ నేపథ్యంలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా నేటినుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆయుష్ కోవిడ్ సేవా కేంద్రాలను ఆయుష్ ఆసుపత్రులందు ప్రారంభించడం జరిగింది. విజయవాడ లోని ప్రభుత్వ ఆయుర్వేద బోధనా అసుపత్రి తో పాటు గుడివాడ, రాజమండ్రి, మరియు కడప లో వున్న ఆసుపత్రులందు ఓ.పి.డి. మరియు 10 పడకలతో ఐ.పి.డి. సేవల ద్వారా నివారణ, నియంత్రణ తో పాటుగా ఒకవెళ కోవిడ్ సోకినట్లైతే దాని తాలూకు దుష్పరిణమాలనుండి త్వరగా కోలుకొనడానికి తగిన చికిత్సలు, సూచనలు, యోగాసనాలు, ప్రాణాయామ పద్ధతులలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వీటితోబాటు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఆహారము, అలవాట్లు, జీవనశైలి విధి విధానలలొ చేపట్టవలసిన మార్పులగురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ నాలుగు ఆసుపత్రులందు మాత్రమే కాక రాష్ట్రంలోని ప్రతి జిల్లానందు ప్రారంభ దశలో ఒక ఆయుష్ ఆసుపత్రి నందు ఈ సేవలు ప్రారంభంచబడినవి. ఈజిల్లా ఆసుపత్రులందు ఐ.పి.డి.సేవలు మినహా మిగిలినవన్నీ అందుబాట్లో వుంటాయి. అవసరానికి అనుగుణంగా ఈ కోవిడ్ కేంద్రాల సంఖ్య మరియు సేవలని మరింతగా విస్తరించడం జరుగుతుంది అని కల్నల్ రాములు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ నేషనల్ మెడికల్ అసోసియేషన్ మరియు ఇంప్ కాప్స్ ఆయుర్వేద ఔషధ తయరీ సంస్థలు కూడా భాగస్వామ్య సహకారాలు అందచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బుధవారం విజయవాడ బందర్ రోడ్ నందలి డాక్టర్ ఆచంట లక్ష్మీపతి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో ఆయుష్ కమిషనర్ ఆయుష్ కోవిడ్ సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సాయి సుధాకర్, అసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ధనుంజయరావు, నేషనల్ మెడికల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వేముల భాను ప్రకాష్ మరియు కళాశాల, ఆసుపత్రి సిబ్బంది , విద్యార్థులు పాల్గొన్నారు
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …