-గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అందజేసిన కలెక్టర్ నివాస్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
సమాచార శాఖలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న డివిజన్ పౌర సంబంధాల అధికారి సీహెచ్ కనకదుర్గా ప్రసాద్‌కు కృష్ణా జిల్లా కలెక్టర్ జే.నివాస్ మచిలీపట్నంలో బుధవారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రశంసాపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జేసీ డాక్టర్ కె.మాధవీలత, సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ మెహబూబ్ బాషా పాల్గొని దుర్గాప్రసాద్‌కు అభినందనలు తెలిపారు.