Breaking News

సబ్ కలెక్టర్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు…

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్ర సమరయోధుల త్యాగాల స్ఫూర్తితో వారి దారిలో నడవడమే మనం వారికి మనమిచ్చే నిజమైన నివాళి అని రెవెన్యూ డివిజన్ అధికారి రాజ్యలక్ష్మి అన్నారు స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం భారత గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆర్డిఓ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్ డి ఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల త్యాగాల ఫలితంగా మనం స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నామని, వారి త్యాగాలను స్మరించుకుంటూ దేశాన్ని అభివృద్ధి బాటలో నిలిపేందుకు నేటి యువత కృషిచేయలన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ పౌరసరఫరాల అధికారి పార్వతి, సబ్ కలెక్టర్ కార్యాలయం డివిజనల్ పరిపాలనాధికారి ఎం హరినాథ్, కార్యాలయ సిబ్బంది , ప్రభృతులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గత ప్రభుత్వానిది స్కాముల్లో రికార్డు… కూటమి ప్రభుత్వానిది స్కీమల్లో రికార్డు

-పాడి రైతులు న్యూజిలాండ్ తరహాలో ప్రగతి సాధించాలి -గత ప్రభుత్వంలో నాయకుల సొంత డెయిరీలను పెంచుకున్నారు -తిరుపతి దుర్ఘటన విషయంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *