హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రగతి భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు గాంధీజీ, అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. దేశానికి వారు సేవలను గుర్తుచేసుకున్నారు. వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎంవో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు సైనిక అమరవీరులకు సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ఉన్న అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి త్రివిధ దళాధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి యుద్ధవీరులకు వందనం చేశారు..
Tags hyderabad
Check Also
రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాం – నిర్మాణరంగాన్ని నిలబెడతాం
-అందుకోసమే ఉచిత ఇసుక పాలసీ -రియల్ ఎస్టేట్ బాగున్న చోటే సంపద సృష్టి -గత ప్రభుత్వంలో నిర్మాణరంగం అడ్రస్ లేదు …