అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని బుధవారం అమరావతిలోని అసెంబ్లీ భవనంపై జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ పాల్గొన్నారు.ముందుగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన తదుపరి జాతిపిత మహాత్మాగాంధి చిత్రపటాని పూలమాలు వేసి ఘణంగా నివాళులర్పించిన అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు మన దేశం అనేక అంతర్గత,బహిర్గత సవాళ్లును ఎదుర్కోంటుందని పేర్కొన్నారు.ఆసవాళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశేష కృషి చేస్తున్నాయని అన్నారు.గణతంత్ర దినోత్సం సందర్భంగా మన దేశ స్వాతంత్ర సాధనకు కృషి చేసిన త్యాగధనులు అదే విధంగా అత్యుత్తమ రాజ్యాంగం ఏర్పాటుకు కృషి చేసిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సహా ఇతర ప్రముఖుల కృషిని స్మరించుకోవాల్సిన తరుణమిదని పేర్కొన్నారు.ప్రస్తుతం దేశంలో కరోనా మూడవ దశ కొనసాగుతోందని దానిని సమర్ధవంతంగా ఎదుర్కునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న కృషిని స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రత్యేకంగా కొనియాడారు.ముఖ్యంగా కరోనా కట్టడిలో గ్రామ స్థాయిలో గ్రామ,వార్డు సచివాలయాలతో పాటు వాలంటీర్ వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తోందన్నారు.
రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ప్రభుత్వం సమర్థవంతంగా చేపడుతోందని శాసన సభాపతి తమ్మినేని సీతారామ్ పేర్కొన్నారు.నూతన జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు ప్రభుత్వ పరిపాలన మరింత చేరువ అవుతుందని అన్నారు.నూతన జిల్లాల ఏర్పాటులో ఆయా ప్రాంతాల చారిత్రక,సాంస్కృతిక నేపధ్యాలను దృష్టిలో పెట్టుకుని నూతన జిల్లాలకు నామకరణం చేయడం కూడా అభినందనియమని ఆయన పేర్కొన్నారు.
ఈకార్యక్రమంలో రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ యం.జకియా ఖానం,అసెంబ్లీ కార్యాదర్శి పి.బాలకృష్ణమాచార్యులు,చీఫ్ మార్షల్ ధియో పిలిప్స్,పలువురు అసెంబ్లీ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.