కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ స్వాతంత్రం కోసం ఎన్నో త్యాగాలు చేసి తమ ప్రాణాలనే తృణప్రాయంగా భావించి, స్వరాజ్య యజ్ఞంలో సమిధలైన వ్యక్తుల ను స్మరించుకుంటు మరింత గా విధుల్లో పునరంకితం అవుదామని ఆర్డీవో ఎస్. మల్లిబాబు పేర్కొన్నారు. 73 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక ఆర్డీవో కార్యాలయంలో జాతీయ జెండాను ఆర్డీవో ఎస్. మల్లిబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సందేశం ఇచ్చారు. ఉత్తమ ఎలెక్టోరల్ నిర్వహణ చేసినందున 54 కోయివురు నియోజకవర్గ పరిధిలోని కె..కమల్ కి రాష్ట్ర స్థాయి లో ఉత్తమ బూత్ లెవెల్ అధికారిగా అవార్డ్ అవార్డ్ తీసుకున్నారు. మంగళవారం అమరావతి లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి విజయనంద్ చేతులు మీదుగా అవార్డు తీసుకున్న సందర్భన్నీ పురస్కరించుకుని ఆర్డీవో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని వాటర్ టాక్స్, సర్వే, ఉత్తమ పౌర సేవలు అందించిన 26 మంది విఆర్వోలు, సర్వేయర్లు లకు ప్రోత్సాహకంగా ప్రశంసా పత్రాలు అందచేశారు. అంతకుముందు సానిటరీ వర్కర్స్ మీసాల భూపమ్మ, రమణమ్మ తదితరులను అనంతరం డ్రైవర్ శ్రీనివాస్, ఢఫేదార్ కె. సత్యనారాయణ, తదితరులను సన్మానించారు. ఈ వేడుకల్లో డివిజనల్ పంచాయతీ అధికారి శివమూర్తి, డీవిజనల్ పీఆర్ఓ లక్ష్మణాచార్యులు, తహసీల్దార్ బి. నాగరాజు నాయక్, ఏవో జవహర్ బాజీ, ఆర్డీవో కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Tags kovvuru
Check Also
అద్భుతమైన, డిజైన్ ఆధారిత ఉత్పత్తి శ్రేణితో AP NAREDCO ఎక్స్‌పోలో ప్రత్యేక ముద్ర వేసిన రీజెన్సీ సెరామిక్స్
-ఎక్స్‌పోలో రీజెన్సీ సిరామిక్స్ ఆవిష్కరణలను NAREDCO ప్రెసిడెంట్ జి హరిబాబు ప్రశంసించారు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సెరామిక్స్ …