విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ బ్యాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు వేముల శ్రీనివాసరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఛైర్మన్/రాష్ట్ర అధ్యక్షుడు తమ్మిశెట్టి చక్రవర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో శ్రీనివాసరావు ఫెడరేషన్ కండువా కప్పి ఫెడరేషన్లోకి ప్రముఖ న్యాయవాది పడమట రవికుమార్ ని ఆహ్వానించగా తమ్మిశెట్టి చక్రవర్తి అతనిని కృష్ణా జిల్లా యువజన విభాగం అధ్యక్షుడుగా ప్రకటించి నియామక పత్రాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో యువజన విభాగం పటుత్వానికి కృషిచేస్తున్న శ్రీనివాసరావుని అభినందించారు. ప్రతి మండలం, గ్రామ స్థాయిలో క్రొత్తగా నియమించినవారు కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం క్రొత్త జిల్లాల అంశాన్ని తెరపైకి తెచ్చారని, కేంద్రప్రభుత్వం ఇచ్చిన ఫ్రీజింగ్ ఉత్తర్వులు ప్రకారం జనాభా లెక్కలు ప్రక్రియ పూర్తికాకుండా గ్రామాల, పట్టణాల భౌగోళిక సరిహద్దులు మార్చకూడదని ఇది అసాధ్యం అని స్వయంగా రెవిన్యూ అధికారులు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అర్ధమవటంలేదో అని ప్రశ్నించారు. దీనినిపట్టిచూస్తే ప్రజలని ఉద్యోగుల పీఆర్సీ అంశాల నిండి దృష్టిమరల్చడానికేనని అర్ధమవుతుంది అన్నారు. ఖచ్చితంగా ఉద్యోగుల పీఆర్సీ ఉద్యమానికి తమ ఫెడరేషన్ మద్ధతు ఉంటుందని తెలిపారు. వేముల శ్రీనివాసరావు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత నిరుద్యోగుల సమస్యలు పెట్టలేదని పైగా ఉద్యోగుల పదవీకాలం పెంచడాన్ని నిరుద్యోగుల నోట్లో మట్టికొట్టడమే అని వెంటనే అన్ని డిపార్ట్మెంట్ ఖాళీలు ప్రకటించి నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఓర్సు ప్రేమరాజు, జిల్లా మహిళా అధ్యక్షురాలు మోర్ల లక్ష్మీ, సిటీ మహిళా అధ్యక్షురాలు దామర్ల సాంబ్రాజ్యం, యూత్ రామకృష్ణ, దాసరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …