విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ తరుపున, వ్యవస్థాపక అధ్యక్షుడు గాంధీ నాగరాజన్ సూచన మేరకు మహిళా జనరల్ సెక్రెటరీ ఎమ్.శ్రీదేవి ఆధ్వర్యంలో పంజాబ్ కేసరి లాలాలజపతి రాయ్ జయంతి వేడుకలు శుక్రవారం ఊర్మిళానేగర్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏపి స్టేట్ మహిళ అధ్యక్షురాలు బి.భారతి మాట్లాడుతూ “పంజాబ్ కేసరి” గా ప్రసిద్ధి పొందిన జాతీయ పోరాట యోధుడు లాలాలజపతిరాయ్ పంజాబ్‌లో 1865 జనవరి 28న జన్మించారని, స్వదేశీ ఉద్యమం, ఆర్య సమాజాన్ని, అతివాద రాజకీయాలను సమన్వయపరచిన భారత జాతీయ అగ్రనాయకుల్లో లాలాలజపతి రాయ్ ఒకరుగా ఉండి పోరాటాలు చేసారని, 1920 సంవత్సరంలో లాలాలజపతి రాయ్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ ఎఐటియుసి ఏర్పాటు చేసి హిందూ మహాసభ, లోక్ సేవామండల్ సంస్థలు ప్రారంభించి, ఆ తరువాత ఆర్యసమాజ్, యంగ్ ఇండియా, అన్ హ్యపి ఇండియా, ఇంగ్లండ్స్ డెబ్ట్ టు ఇండియా అనే పుస్తకాలు రచించారని తెలిపారు. ఇంగ్లాండ్‌లో ఏర్పడిన సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా లాహోర్‌లో జరిగిన నిరసన ఊరేగింపులలో లాఠీ దెబ్బలు తిని 1928 నవంబరు 17న శాశ్వతంగా కన్నుమూసి స్వాతంత్ర్య పోరాట యోధులలో మకుటం లేని మహారాజుగా నిలిచారని భారతి పేర్కొన్నారు. ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి అని లాలాలజపతి రాయ్ అంటూ ఉండేవారని “నేను మరణించవచ్చు, కాని నా నుండి వెలువడే ప్రతి నెత్తురు చుక్క నుండి లక్షలాది స్వాతంత్య్ర సమరయోధులు ఉద్భవిస్తారు” అని ఆయన చివర మాటలుగా నిలిచాయని గుర్తుచేశారు. కార్యక్రమంలో ప్రధాన మహిళ అధ్యక్షురాలు ఆర్.ఎన్.శివరంజని, మాస్టర్ కార్తీ, డి.ప్రణవ్ జైసూర్య, వి.రమేష్, ఎల్.శ్రీను, ఎన్.రఘు, మహిళా సేవకులు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
6.60 కోట్లతో నిర్మించనున్న జి.టి.యస్ పనులకు శంకుస్థాపన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో శాస్తీయ పద్దతిలో వ్యర్దాల నిర్వహణకు జి.టి.యస్ (గార్బేజ్ ట్రాన్స్ఫర్ సిస్టం) …