Breaking News

టిడ్కో గృహా నిర్మాణాల లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు వేగవంతం చేయాలి…

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
టిడ్కో గృహా నిర్మాణాల లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ జె. నివాస్‌ మున్సిపల్‌ కమీషనర్లను ఆదేశించారు. శనివారం నగరంలోని కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయం నుండి మున్సిపల్‌ కమీషనర్లు, గృహా నిర్మాణాల శాఖ, టిడ్కో, మెప్మా అధికారులతో రుణాల మంజూరు లక్ష్యాలపై టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా రుణాల మంజూరుకు నిర్థేశించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రోజుకు ఐదుగురు చొప్పున ప్రతీ బ్యాంకు బ్రాంచ్‌ నుండి రుణాలు మంజూరు చేయించాలన్నారు. ఇందుకు మున్పిపల్‌ కమీషనర్లు, మెప్మా, టిడ్కో, గృహా నిర్మాణ శాఖ అధికారులు బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 19,376 టిడ్కో గృహాలకు 680 కోట్ల రూపాయలు మంజూరు చేయాల్సివుందన్నారు. అందులో ఇప్పటివరకు 2,556 గృహాలకు రూ. 41.02 కోట్ల మాత్రమే మంజూరు అయ్యాయన్నారు. మిగిలిన వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని, మంజూరైన గృహాలకు సంబంధించిన రుణాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ప్రతీవారం మున్సిపల్‌ కమీషనర్లకు నిర్థేశించిన లక్ష్యాలను సమీక్షించారు. విజయవాడ, మచిలీపట్నం, కార్పొరేషన్లు, గుడివాడ, నూజివీడు, జగ్గయ్యపేట, ఊయ్యూరు, తిరువూరు, నందిగామ, మున్సిపల్‌ కార్పొరేషన్‌లో రుణాల మంజూరుపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని మున్సిపల్‌ కమీషనర్లను కలెక్టర్‌ కోరారు. 365 చందరపు గజాలు ఉన్న గృహానికి 3.15 లక్షలు రూపాయల చొప్పున మంజూరు చేయవల్సిన 5,552 గృహాలు ఉన్నాయని, 430 చదరపు గజాలు గల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇంటి నిర్మాణానికి 3.65 లక్షల రూపాయలు రుణంగా మంజూరు చేయవల్సినవి13,824 గృహాలు
ఉన్నాయని కలెక్టర్‌ అన్నారు. టెలీకాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ హౌసింగ్‌ శ్రీవాస్‌ నూపూర్‌ అజయ్‌కుమార్‌, టిడ్కో ప్రాజెక్టు ఆఫీసర్‌ బి. చిన్నోడు తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *