విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్ 19 వైరస్ విజృంభిస్తున్నఇప్పటి పరిస్థితుల్లో ప్రతివారూ మనకు ఏదో అయిపోతుందని భయం కానీ… మనకు ఏం కాదులే అని నిర్లక్ష్యంగానే తగదని నేషనల్ మెడికల్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వేముల భాను ప్రకాష్ అన్నారు. నగరంలో నేషనల్ మెడికల్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వేముల భాను ప్రకాష్ సుపరిచితులు. గతంలో లాక్ డౌన్ సమయంలో నుండి ఇప్పటివరకు కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ లలో అనేక పేద కుటుంబాలకు కరోనా పై అవగాహన కల్పిస్తూ, జాగ్రత్తలు తీసుకోవడం పై చేతనైనంతలో సాయం చేస్తున్నారు. ఈ సందర్భంగా నేషనల్ మెడికల్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వేముల భాను ప్రకాష్ మాట్లాడుతూ ఆయుర్వేదంలో సకల వ్యాధులకు ఆయుర్వేద మందులున్నాయన్నారు. విజయవాడ, బీసెంట్ రోడ్, ఎల్ ఐ సి బిల్డింగ్ ఎదురుగా గూడవల్లి వారి వీధిలో అశోక ట్రేడర్స్ ఎదురుగా వున్న ఇంప్ కాప్స్ పంచకర్మ హాస్పిటల్ నందు రోజు అందుబాటులో ఉంటామన్నారు. కోవిడ్ సోకినట్లైతే దాని తాలూకు దుష్పరిణమాలనుండి త్వరగా కోలుకొనడానికి తగిన చికిత్సలు, సూచనలు, యోగాసనాలు, ప్రాణాయామ పద్ధతులలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, వీటితోబాటు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఆహారము, అలవాట్లు, జీవనశైలి విధి విధానాలలొ చేపట్టవలసిన మార్పుల గురించి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఇప్పటి విపత్కర పరిస్థితిలో దేవుని దయ వలన, అందరి సమిష్టి కృషి వలన పేదలకు, కరోనా బాధితులకు సేవలందించడంలో చేతనైనంతలో సాయం చేస్తున్నానన్నారు. వీలైనంతవరకూ ప్రతి వారు చేతులు శుభ్రం చేసుకోవడం, మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడటం, భౌతిక దూరం పాటించి తోటి వారికి ఇబ్బంది కలిగించకుండా వారు ఉండాలని, బయటకు అవసరమైతే తప్పితే ఇంటి వద్దే క్షేమంగా ఉంటూ పెద్దలు, పిల్లలు, వృద్ధులు, మహిళలు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదన్నారు. ఇది మీకు మీ కుటుంబానికి ఎంతో మంచిదన్నారు.. అందుబాటులో వున్నపేదవారికి ఉచితంగా కోవిడ్ మందుల కిట్టు పంపిణీ చేస్తున్నామన్నారు. మూగ జీవాలను కాపాడాలని, చెట్లను మన వదిలే కార్బన్‌డైయాక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ మనకు విడుదల చేస్తున్న ప్రాణ సంజీవిని చెట్లు. అటువంటి వాటిని కాపాడుకుందాం. మనం చెట్లు నాటి భావితరాల వారికి చెట్ల నీడను కల్పిద్దామన్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంధ సంస్థలు, ప్రజలు సమిష్టి పోరాటంతోనే కరో నా కట్టడి చేయగలుగుతామని అదే మనందరి ప్రధమ కర్తవ్యమన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …