-సాథనకమిటి కన్వీనరు EVపూర్ణచంద్
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాగా అన్ని అర్హతలు హంగులన్న తెనాలిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని తెనాలి జిల్లా సాథన కమిటి కన్వీనర ఈదర వేంకట పూర్ణచంద్ రాష్ట్ర ప్రభత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం బస్టాండు వద్దగల ఈగల్ హోటల్ లో సాథనకమిటి సభ్యుల సమావేశమై 2009లో గత పాలకుల ఉదాశీనత వైఖరితో తెనాలికి దక్కవలసిన జిల్ల హోదా కొల్పోయిందని వాపోయారు. రాజకీయంగా ఉథ్థండులైన ఇద్దరు CMలు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు, ఆచార్య రంగా CPM అగ్రనేత బాల గంగాథరరావులు MPలు కళల విషయానికొస్తే ఎందరో పౌరాణిక, సాంఘిక, రేడియే సినీ నటీనటులు, సాహిత్యంలో తెనాలి రామకృష్ణ నుండి చలం వేటూరి లు విద్య లో పలు విద్యాలయాలు శాస్త్రవేత్త యలవర్తి నాయుడమ్మ, ఈ ప్రాంతంలోని వారే! సస్యశ్యామలమైన భూములు, డైలీ 80 రైళ్లాగే రైల్వేజంక్షన్, పారిశ్రామికంగా కుమార్ పంప్స్ డబల్ హర్స్ మినపగుళ్లు నీటి కొరతలేక సదా పారే మూడు కాల్వలున్న తెనాలిని జిల్లా హోదా లేక పోవటంతో ఉన్న కో అపరేటివ్ చైతన్య గ్రామీణ బ్యాంకులను, పల్నాడు ఎక్స్ ప్రెస్ గుంటూరుకు తరలించారన్నారు. ప్రస్తుతం జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరుగు తున్నందున అన్నిసదుపాయాలున్నతెనాలిని జిల్లాగా ప్రకటించేవరకు అందరూ తమ మౌనం వీడి ముందుకు రావాలని భావితరాలకు జరిగే తీవ్ర నష్టం నివారించాలని, మౌనం వీడితేనే ప్రజల సహకారం ఉంటుందని లేకపోతే ప్రజలే దూరం చెస్తారని పరోక్షంగా హెచ్చరించారు. జిల్లాల విభజన భౌగోళిక చారిత్రక సాంస్కృతిక నియమ నిబందనావాళి పాటించక పలుచొట్ల విభజన సంక్లిష్టంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గుత్తా వేంకటరత్నం, అడపా సంపత్ మేడూరి భాస్కరరావు తిరమలశెట్టి సత్యన్నారాయణ తదితరుల పాల్గొన్నారు.