-జాయింట్ కలెక్టర్ డా కె. మాధవిలత.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్నపాలవెల్లువలో కేంద్రాలను పెంచి పాల సేకరణ చేపట్టాలని జిల్లా జాయింట్‌కలెక్టర్ డా.కె.మాధవిలత అధికారులను ఆదేశించారు.
నగరంలోని జెసి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం జగనన్న పాల వెల్లువ పై పశుసంవర్థక, సహకార, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, సంబంధిత మండల యంపిడివోలు, తహాశీల్థార్లతో జాయిట్ కలెక్టర్ కె. మాధవిలత టెలీ కాన్ఫరెన్స నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళ పాడి రైతుల సుస్థిర ఆర్థిక అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా జగనన్న పాల వెల్లువ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించుకున్నామన్నారు. దీనిలో భాగంగా 100 గ్రామాల్లోని సోసైటీల ద్వారా పాలను సేకరిస్తున్నామన్నారు. ఈ పథకం పేజ్`3లో భాగంగా 100 గ్రామాల్లో ఆటోమెటిక్‌మిల్క్ కలెక్షన్ (పాల సేకరణ) కేంద్రాలలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. వీటిలో భాగంగా కొత్తగా బాపులపాడు మండలంలో 24 గ్రామాలు, నూజివీడు మండలంలో 18 గ్రామాలు, అగిరిపల్లి మండలంలో 14 గ్రామాల్లో ఇప్పటికే సర్వే పూర్తి చేయడం జరిగిందన్నారు. ఇంకను సర్వే పూర్తి చేయవల్సిన గ్రామాల్లో తక్షణమే పూర్తి చేసి భవనాల ఎంపిక, ఏర్త్‌వర్క మొత్తాన్ని పూర్తి చేసుకుని వెనువెంటనే ఆటోమెటిక్‌మిల్క్ కలెక్షన్ (పాల సేకరణ) కేంద్రాలను ఏర్పాటు చేసి పాల సేకరణ ప్రారంభించాలన్నారు. ఇప్పటివరకు 14,603 మంది లబ్ధిదార్లు నమోదు చేసుకున్నారని మిగిలిన వారిని కూడా నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని జాయింట్‌కలెక్టర్ మాధవిలత అధికారులను ఆదేశించారు.