రోడ్లపై మరియు డ్రైన్ లలో చెత్త లేదా వ్యర్థములు వేయకుండా చూడాలి… : కమిషనర్ పి. రంజిత్ భాషా 

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
నగర పర్యటనలో భాగంగా కమిషనర్ రంజిత్ భాషా, ఐ. ఏ. ఎస్., పటమట చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియం, గురునానక్ నగర్ స్విమ్మింగ్ పూల్, గుణదల గంగిరెద్దుల దిబ్బ 46 ఎమ్. ఎల్. డి వాటర్ ఫిల్టరేషన్ ప్లాంట్ మొదలగునవి పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేశారు. ముందుగా పటమట ప్రాంతములో ఆధునీకరించిన చెన్నుపాటి రామాకోటయ్య ఇండోర్ స్టేడియం లో క్రీడాకారులకు అందుబాటులో గల సదుపాయాలు, జీమ్ నందలి పరికరాలు మరియు స్టేడియంలో ఎంత మంది సభ్యులుగా ఉన్నారు వంటి విషయాలు అధికారులను అడిగితెలిసుకొని పలు సూచనలు చేశారు. అదే విధంగా రైతు బజారు మరియు పరిసర ప్రాంతాలను పరిశీలించిన సందర్బంలో రైతు బజారు సమీపంలో ఉన్నటువంటి పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణ విధానం పరిశీలించి ఎల్లపుడు మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. హైస్కూల్ రోడ్ నందలి చిరు వ్యాపారులు రోడ్లపై లేదా డ్రైన్ లలో విచ్చలవిడిగా చెత్త మరియు వ్యర్థములు పడవేయకుండా వారికి అవగాహన కల్పించాలని, అయినప్పటికీ వారి యొక్క ప్రవర్తన మార్చుకోకపోతే అట్టి వారికీ అపరాధ రుసుము విధించాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ను ఆదేశించడం జరిగింది. డ్రైయిన్స్ నందు ఎప్పటికప్పుడు డీసిల్టింగ్ చేయటతో పాటుగా తొలగించిన వ్యర్ధ పదార్ధాలను వెనువెంటనే అక్కడ నుండి తొలగించి పరిసరాలు అన్నియు పరిశుభ్రoగా ఉండే విధంగా చూడాలని ప్రజరోగ్య మరియు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తదనంతరం పటమట ప్రాంతములో అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన సందర్బంలో అక్కడ జరుగుతున్న చెట్ల కొమ్మలని ముక్కలు చేసేటువంటి యంత్రము యొక్క పనీతీరును పరిశీలించారు. తదుపరి గురునానక్ నగర్ కాలనీ స్విమ్మింగ్ పూల్ ను పరిశీలించి అక్కడ చేసినటువంటి ఏర్పాట్లు దానిని ప్రజలు వినియోగపరుచుకుంటున్న తీరు మరియు జీమ్ పరికరాలు మొదలగునవి పరిశీలించి సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం గుణదల గంగిరెద్దుల దిబ్బ నందలి త్రాగునీటి శుద్ధి చేయు ఫిల్టర్ ప్లాంట్ యొక్క పనితీరు మరియు నీటిని పంపింగ్ చేయు విధానమును అధికారులను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. ఈ సందర్బంలో ఇన్ టేక్ వెల్ నుండి రావాటర్ ఏవిధంగా సేకరించి శుద్ధిచేయుచున్నది అడిగి తెలుసుకొని త్రాగునీటి పైపులైన్ లల్లో లీకేజీలు లేకుండా చూడాలని అన్నారు. పై పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ప్రభాకరరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. జి. గీతభాయి, ఎగ్గిక్యూటీ ఇంజనీర్ చంద్రశేఖర్, స్పోర్ట్స్ ఆఫీసర్ టి. ఉదయకుమార్ మరియు ఇతర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *