విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏ.పి.ఎస్.ఆర్.టి.సి ఉద్యోగ సంఘాల JAC ప్రతినిధులు నిన్న ఎం.డి. సి. హెచ్. ద్వారకా తిరుమల రావు,ఐ.పి.ఎస్, ని కలిసి తామంతా ఈ నెల 6 వ తేదీ అర్ధరాత్రి నుండి సమ్మెలోకి వెళ్తున్నట్లు తెలిపారు. తదనంతరం 45 అంశాలతో కూడిన మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది.
ఆ సందర్భంగా ఎం.డి. శ్రీ సి. హెచ్. ద్వారకా తిరుమల రావు,ఐ.పి.ఎస్. మాట్లాడుతూ ఆర్టీసీ సిబ్బంది సమ్మెలోకి వెళ్ళడం సమంజసం కాదని అన్నారు. అటు ప్రభుత్వం,ఇటు సంస్థ ఆర్టీసీ ఉద్యోగులకు ఎన్నో సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. వారు తెలియ పరిచిన 45 అంశాలకు వివరణ ఇస్తూ దశల వారీగా మనమందరం కూర్చుని చర్చించు కుంటే చాలా వరకు పరిష్కార మవుతాయని కూడా తెలిపారు.
ప్రభుత్వ పరంగా చేయాల్సిన వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, సానుకూలంగా చర్చించి వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తానని తెలిపారు.
కాగా ఈ రోజు అనగా 02.02.2022 తేదీన APSRTC SC/ST ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు ప్రజా రవాణా ప్రభుత్వ డ్రైవర్ల అసోసియేషన్ల ప్రతినిధులు ఆర్టీసీ ఎం.డి. ని కలిసి తామంతా సమ్మెకు వ్యతిరేకమని, తమ సంఘ ప్రతినిధులు రాష్ట్ర మంతటా 13,000 మంది ఉన్నారని ఇప్పటికే తమవారందరికీ వాట్సప్, మెయిల్, ఫోన్లు ద్వారా మాట్లాడి విధులకు హాజరు కమ్మని చెప్పినట్లు తెలిపారు. కరోనా సమయంలో రోడ్డున పడాల్సిన 55 వేల ఆర్టీసీ కుటుంబాలకు ఆశ్రయ మిచ్చి, ప్రతి నెలా జీతాలు ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేయడమంటే తల్లి పాలు తాగి రొమ్మునే గుద్దినంత పాపమని, చర్చల ద్వారా సమస్యలు పరిష్కారమవుతాయని తాము నమ్ముతున్నట్లు వారు ప్రభుత్వం పట్ల తమ విశ్వసనీయతను వ్యక్త పరిచారు. కాగా ఇప్పటికే పి.టి.డి. వై.ఎస్.ఆర్. ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా తాము సమ్మెకు దూరమని తెలపడం జరిగింది.
Tags vijayawada
Check Also
సోలార్ పవర్ కార్పోరేషన్ 2025 డైరీ, క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి గొట్టిపాటి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ సోలార్ పవర్ కార్పోరేషన్ 2025 డైరీ, క్యాలెండర్ ను చీఫ్ సెక్రటరీ …