మధ్యాహ్న భోజన పధకం లో పౌష్టికాహార విషయంలో సమతుల్యత పాటిస్తున్నది… : మంత్రి తానేటి వనిత

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో పిల్లలకు అందించే మధ్యాహ్న భోజన పధకం లో పౌష్టికాహార విషయంలో సమతుల్యత పాటిస్తున్నదని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. గురువారం కొవ్వూరు మండలం పసివేదల ప్రాథమిక పాఠశాలలో పిల్లలతో మధ్యాన్న భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక మేనమామ లా ఆలోచించి చిన్నారులకు మధ్యాన్న భోజన పధకం లో అందచేసే ఆహార పదార్థాలు విషయంలో క్యాలెండర్ స్వయంగా రూపుదిద్దడం జరిగిందన్నారు. ఇదే మన సీఎం పిల్లలు పట్ల ఉన్న చిత్తశుద్ధి ని తెలియచేస్తుందని తానేటి వనిత తెలిపారు. పాఠశాల లో అందచేస్తున్న భోజనం పట్ల పిల్లలు ఆనందాన్ని వ్యక్తం చేశారన్నారు. పిల్లలు తో కలసి భోజనం చేశారు. ఇక్కడి ఆహార పదార్థాలు శుచిగా ఉండడమే కాకుండా అత్యంత శుభ్రతను పాటించడం పట్ల నిర్వాహకులను మంత్రి అభినందించారు. ఆహర పదార్థాలలో కొంచెం పులుపు తగ్గించాలని మంత్రి సూచించారు. పిల్లలు తో మాట్లాడుతూ నేను ఎవరు?, మిగిలిన వారి వివరాలు అడుగగా పిల్లలు మీరు మంత్రి అని, మిగిలిన వారిలో మా స్కూల్ పేరెంట్ కమిటీ ప్రెసిడెంట్ ఉన్నారని చెప్పడంతో మంత్రి వారి ఆసక్తి పట్ల అభినందించారు. అనంతరం గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *