విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్, సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్ల తో కలిసి నగర కమిషనర్ పి. రంజిత్ భాషా, ఐ. ఏ. ఎస్ ను కలిసి వారి వారి వార్డులలో అసంపూర్తిగా ఉన్న వివిధ అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయుటకు తగు చర్యలు తీసుకోవలసిందిగా కోరారు. L&T వారి డ్రైయిన్స్ రామకృష్ణాపురం మెయిన్ రోడ్ నిర్మాణం వివిధ ప్రదేశములలో కల్వర్ట్లు, సంప్ హౌస్, పార్కుల నిర్మాణము, BT రోడ్ల మరమత్తులు తదితర పనులు వెంటనే చేపట్టి ప్రజలకు అసౌకర్యముగా లేకుండా చూడవలెనని కోరారు. రానున్న వేసవి దృష్ట్యా త్రాగునీటికి ఇబ్బంది రాకుండా అవుసరమగు చర్యలు గైకొనవలసినదిగా కోరారు. కర్మల భవనము, కమ్యూనిటీ హాల్ నిర్మాణమునకు UGD నెట్ వర్క్ ఏర్పాటుకు తగు ప్రతిపాదనలు సిద్ధం చేయవలెనని కోరారు. కమిషనర్ పి. రంజిత్ భాషా, ఐ. ఏ. ఎస్ మాట్లాడుతూ ప్రతి ఒక్క సమస్యను సంబంధిత అధికారుల చేత వెంటనే పరిశీలన జరిపించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరింపబడునట్లు చూడగలనని, ప్రధానంగా త్రాగునీటికి ఇబ్బంది రాకుండా యుద్దపాతిపదికన చర్యలు గైకొనగలనని తెలిపారు. ఈ కార్యక్రమములో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజ, పలువురు కార్పొరేటర్లు, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారదదేవి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. జి. గీతభాయి పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …