విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సుమారు రూ.88 కోట్లతో నిర్మించిన బెంజ్ సర్కిల్ రెండవ ఫ్లైఒవర్తో పాటు రాష్ట్రంలోని 52 రోడ్డు ప్రాజెక్టులకు కూడా శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు కేంద్ర ఉపరితల రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈనెల 17వ తేదీ విజయవాడకు రానున్నారు. ఆయన రాక కోసం రాష్ట్ర ప్రభుత్వం భారి ఏర్పాట్లు చేస్తుంది. డిసెంబరు 7వ తేదీన ఈ కార్యక్రమం భారత రక్షణ శాఖ చీఫ్ బిపిన్ రావాత్ హైలీకాప్టర్ ప్రమాదంలో మరణించినందున వాయిదా పడిరది. జిల్లాకు విచ్చేస్తున్న కేంద్ర ఉపరితల రవాణ శాఖ మంత్రి ఏర్పాట్లను పరిశీలించేందుకు రవాణ శాఖ ముఖ్య కార్యదర్శి యంటి కృష్ణబాబు, సియం కార్యక్రమాల సమన్వయ కర్త, యంఎల్సి తలశిలరఘరాం, జిల్లా కలెక్టర్ జె. నివాస్, నగర పోలీస్ కమీషనర్ టికె రానాలతో కలిసి ఇందీరాగాంథీ మున్సిపల్ స్టేడియంలో మంగళవారం తనిఖీ చేసి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా యంటి కృష్ణబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో జరగనున్న, జరిగిన జాతీయ రహదారుల అథారిటీకి సంబంధించిన 51 ప్రోజెక్టులను కేంద్ర ఉపరితల రావాణా శాఖ మంత్రి శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారన్నారు. రాష్ట్రంలో మొత్తం రూ.21 వేల 6 వందల కోట్లతో 1381 కిలో మీటర్ల పోడవైన రహదారులకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేస్తారన్నారు. ఆయన రాక సందర్భంగా బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సుమారు 2 వేల మంది హాజరవుతరన్నారు. రహదారులు, రైల్వే ఒవర్ బ్రిడ్జి, ఫ్లైఒవర్ల ఫోటోలు, ప్రాజెక్టు వివరాలతో సహా బంహిరంగ సభ వద్ద ప్రదర్శించాలన్నారు. అలాగే ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా హాజరయ్యే ఈ కార్యక్రమానికి మూడు వేచి ఉండే తత్కాలిక గదులను కూడా ఏర్పాటు చేయమని ఆదేశించారు. కేంద్ర మంత్రి బస చేసే హోటల్‌కు గన్నవరం నుండి రవాణ సదుపాయం కల్పిస్తు రహదారులను పరిశీలించి తగిన మరమత్తులను కూడా చేపట్టాలని నేషనల్ హైవేస్ అధికారులను కోరారు. కొత్తగా నిర్మించిన బెంజ్‌సర్కిల్ రెండవ ఫ్లై ఒవర్తో పాటు రోడ్లుకు ఇరుపక్కల సూచక బోర్డులు ఏర్పాట్లు చూసుకోమని చెప్పారు. ఫ్లైఒవర్కు పడమట భాగంలో రోడ్లు విస్తరణ చేపట్టమన్నారు. పమ్మిడి ముక్కల మండలంలోని గురజాడ వద్ద అండర్‌పాస్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సభకు వచ్చే ఆహుతులకు మాస్క్, శానిటైజర్ పంపిణీ చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ జె. నివాస్ మాట్లాడుతూ స్క్రూ బ్రిడ్జి జంక్షన్ నుంచి నోవటల్ హోటల్ మధ్య బెంజ్‌సర్కిల్ రెండవ ఫ్లైఒవర్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నగర పోలీస్ కమీషనర్ టికె రానా, డిసిపి హర్షవర్థన్, వియంసి కమీషనర్ రంజిత్‌భాషా, నేషనల్ హైవేస్ రిజినల్ అధికారులు ఆర్కెసింగ్, ఎస్కెసింగ్, ప్రాజెక్టు డైరెక్టర్ నారాయణరెడ్డి, మేనేజర్ అమ్రిత్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …