-షాపులు ఉన్న రజకులు, నాయిబ్రహ్మణులు, దర్జీలు 28,448 మంది లబ్ధిదారులకు
-రూ.28.45 కోట్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ జె. నివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రమకు తగిన ఆదాయం లేని చేతివృత్తి పనివారికి తోడుగా జగనన్న చేదోడు పథకానికి శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జగనన్న చేదోడు పథకం రెండవ విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా 2.85 లక్షల మంది అర్హులైన రజకులు, నాయిబ్రాహ్మణులు, దర్జీలకు 285.35 కోట్ల ఆర్థిక సాయం ముఖ్యమంత్రి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్వయం ఉపాధి కేటగిరిలో ఎక్కువ మంది ఆదారపడి ఉన్న చేతివృత్తి పనులు చేసుకునే రంగంలో రజకులు, నాయిబ్రాహ్మణులు, దర్జీల సంక్షేమం కోసం ప్రతీ ఏడాది 10 వేల రూపాయల చొప్పున జమ చేస్తూ వారి కాళ్లపై వారు నిలబడే విధంగా ఆర్థిక సాయం చేస్తున్నట్లు తెలిపారు. వరుసగా రెండోవ ఏడాది వీరికి తోడుగా నిలబడినట్లు ఈ ఏడాది 2.85 లక్షల మంది లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాలో జమ చేసిన్నట్లు తెలిపారు. రెండు విడతలుగా రాష్ట్రలో మొత్తం రూ.583.78 కోట్లు జమ చేసిన్నట్లు తెలిపారు. స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ జె.నివాస్, శాసన మండలి సభ్యులు టి. కల్పలత, శాసనసభ్యులు మల్లాది విష్ణు, మేక ప్రతాప్ అప్పారావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ వడ్డేలు కార్పొరేషన్ చైర్మన్ సైదు గాయత్రి సంతోషి, ఆంధ్రప్రదేశ్ బట్రాజు కార్పొరేషన్ చైర్మన్ కూరపాటి గీతాంజలీ దేవి, ఆర్టీసీ జోనల్ చైర్‌పర్సన్ తాతినేని పద్మావతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తిప్పలమల్లి జమలపూర్ణమ్మ, ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌నెట్ కార్పొరేషన్ చైర్మన్ డా. పి గౌతమ్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ కమ్మ సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్ తుమ్మల చంద్ర శేఖర్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హరిక, జడ్పీ వైస్ చైర్ పర్సన్ గరికపాటి శ్రీదేవి, నగర డిప్యూటి మేయర్లు బెల్లం దుర్గా, అవుతు శ్రీశైలజారెడ్డి, ఏపి ఇండస్ట్రీస్ కార్పొరేషన్ బండి పుణ్యశీల, ఏపి మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ షేక్ అసీఫ్, ఏపి గౌడ కార్పొరేషన్ చైర్మన్ యం శివరామకృష్ణ, జాయింట్ కలెక్టర్ (ఆసరా) కె.మోహన్‌కుమార్, బిసి కార్పొరేషన్ ఇడి రాజకుమారి పలువురు అధికారులు పాల్గొన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ జె.నివాస్ పలువురు శాసనసభ్యులు ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లాలో వృత్తి చేసుకుంటున్న 19,036 మంది దర్జీలకు 19.04కోట్ల రూపాయలు, 6,094 మంది రజకులకు 6.09 కోట్ల రూపాయలు,3,318 మంది నాయిబ్రాహ్మణులకు రూ. 3.32 కోట్లు పంపిణీ చేశారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గౌవర ముఖ్యమంత్రి హామి మేరకు షాపులు ఉన్న రజకులు షాపులు ఉన్న నాయిబ్రహ్మణులు, షాపులు ఉన్న దర్జీలకు ప్రతీ ఏడాది 10 వేల చొప్పున 5 సంవత్సరాల పాటు ఒక్కొక్కరికి 50 వేల రూపాయల ఆర్థిక సాయం మంజూరు చేసి వారిని ఆదుకోవడం ప్రభుత్వ ద్యేయం అన్నారు.
కరోనాలో కూడా ఏ పథకం ఆపకుండా ఇచ్చిన జగనన్నకు ధన్యవాదాలు:
మచిలీపట్నం మండలం చిన్నాపురం గ్రామానికి చెందిన లబ్ధిదారు టైలర్ మెండు సరళ వీడియోకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రికి తన అభిప్రాయం తెలుపుతూ 18 ఏళ్లుగా టైలర్ వృత్తి చేసుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మమ్ములను గుర్తించి గత ఏడాది మరియు ఈ ఏడాది 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ మొత్తాన్ని తన షాపు అభివృద్ధికి వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. తనకు ఇద్దరు అడపిల్లలు ఒక్కరు డీగ్రీ మరోకరు బిటేక్ చదువుతున్నారు. జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యదీవెన పథకాలు మా పిల్లలకు మంజూరు అయ్యాయని ధాన్యవాదాలు తెలిపారు. తన అత్తగారికి వృద్దాప్య పెన్షన్‌తో పాటు తన తల్లికి కాపు నేస్తం పథకం పొందుతున్నట్లు తెలిపారు. డోక్రా గ్రూపులో సభ్యురాలు అయిన నాకు రెండు విడతలుగా రుణమాఫి పొందనని తన సంతోషని వ్యక్తం చేశారు.
మచిలీపట్నంలో 30 ఏళ్లుగా నాయి బ్రహ్మణవృత్తి చేసుకుంటున్న తరకటూరు సీతారాములు తన అభిప్రాయ తెలుపుతు గతంలో ఎవరూ చేయని విధంగా నాయి బ్రహ్మణులకు మొట్టమొదటి సారి ఏడాదికి 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందచేస్తున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. అమ్మఒడి, ఇంటింటి రేషన్, డయాలసిస్, తలసెమియ రోగులకు 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
మచిలీపట్నం 3వ డివిజన్ వలందపాలెంకు చెందిన పోలుకొండ వెంకటేశ్వర్లు ఇస్త్రీ షాపు నడుపుకుంటున్నానని రజకులను గుర్తించి వారికి ఆర్థిక సాయం అందిస్తున్న ముఖ్యమంత్రి జగనన్నకు ధన్యవాదాలు తెలిపారు.