-సచివాలయ సిబ్బంది భాద్యతగా విధులు నిర్వర్తించాలి – కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుణదల ప్రాంతములోని 13వ వార్డ్ సచివాలయము మరియు ఆరుళ్ నగర్ నందలి 15 & 20 వార్డ్ సచివాలయాలను కమిషనర్ పి.రంజిత్ భాషా పరిశీలించి సచివాలయాలలో సిబ్బంది యొక్క పని విధానము అడిగితెలుసుకొన్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటించు వాలెంటిర్లల పని విధానము, ప్రభుత్వ పథకములపై ప్రజలకు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమములు తదితర వివరాలను వార్డ్ పరిపాలన కార్యదర్శులను అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకములు అన్నియు అర్హులైన వారికీ చేరువ చేసే విధంగా భాద్యతగా తమకు కేటాయించిన విధులు నిర్వహించాలని మరియు పథకముల వివరాలు అన్నియు ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వివిధ కారణాలతో సచివాలయములకు వచ్చు వారి వివరాలు అడిగితెలుసుకొని ప్రజలకు ఎదురౌతున్న సమస్యలను సానుకూలంగా తెలుసుకొని వాటిని సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఫిర్యాదుల రిజిస్టర్ ను నిర్వహించవలెనని సిబ్బంది క్షేత్ర స్థాయిలో తనిఖీలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మూవ్మెంట్ రిజిస్టర్ నందు నమోదు చేయవలెనని లబ్దిదారుల వివరములు ఎప్పటికప్పుడు నోటీసు బోర్డు నందు ఉంచవలెనని ఆదేశించారు.