Breaking News

కోవిడ్ -19 తో చనిపోయిన వారి కుటుంబాల పిల్లలకు పౌష్టికాహారం, నిత్యావసర సరుకులు పంపిణి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
హెల్ప్ ఆర్గనైజేషన్, స్త్రీ శిశుసంక్షేమ శాఖ , గుంటూరు వారి సహకారంతో కోవిడ్ -19 లో చనిపోయిన వారి కుటుంబాల పిల్లలకు పౌష్టికాహారం, నిత్యావసర సరుకుల పంపిణీ శుక్రవారం ఉదయం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి  కే.రత్నకుమార్ ద్వారా పంపిణీ జరిగింది. హెల్ప్ ఆర్గనైజేషన్, స్త్రీ శిశుసంక్షేమ శాఖ , గుంటూరు వారి సహకారంతో కోవిడ్ -19 తో తల్లి / తండ్రి లేదా ఇద్దరు చనిపోయిన వారి కుటుంబాల పిల్లలకు, హెల్ప్ ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ భాస్కర్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ విజయ కుమార్ , డీసీపీఓ విజయ కుమార్ , స్త్రీ శిశుసంక్షేమ శాఖ , గుంటూరు ప్రాజెక్ట్ డైరెక్టర్ మనోరంజని, మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి  కే.రత్నకుమార్ చేతులమీదుగా నిత్యావసర సరుకులతో కూడిన పౌష్టికాహారం పంపిణి చేయటం జరిగింది. ఈ సందర్భంగా కోవిడ్ -19 తో తల్లి / తండ్రి లేదా ఇద్దరు చనిపోయిన వారి కుటుంబాల పిల్లలకు అండగా నిలబడటం సామజిక బాధ్యత అని వక్తలు పేర్కొన్నారు అలాగే కోవిడ్ వల్ల చనిపోయిన వారి పిల్లల చదువు ఆపొద్దని చిన్నపిల్లలు అయితే అంగన్వాడీ సెంటర్స్ లో పెద్ద పిల్లలు అయితే గవర్నమెంట్ స్కూల్స్ లో చేర్పించాలని స్త్రీ శిశుసంక్షేమ శాఖ , గుంటూరు ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి మనోరంజని సూచించారు . పిల్లలకు గవర్నమెంట్ వారు అందించే సదుపాయాలు అందకపోయినట్లైతే అంగన్వాడీ టీచర్స్ ద్వారా స్త్రీ , శిశు సంక్షేమ శాఖ ని సంప్రదించాలని ఈ సందర్భంగా మనోరంజని తెలియచేసారు.

ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి  కే.రత్నకుమార్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎప్పుడు సహకరిస్తుందని , కోవిడ్ -19 తో తల్లి / తండ్రి లేదా ఇద్దరు చనిపోయిన వారి కుటుంబాల పిల్లల కు సహకారం అందించటం సమాజం లో ప్రతి ఒక్కరి బాధ్యత అని , నవంబర్ నెలలో ఆజాదికా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా స్త్రీ శిశుసంక్షేమ శాఖ , గుంటూరు వారి సహకారం తో 15 మంది కోవిడ్ వల్ల చనిపోయిన వారి పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వము వారు మంజూరు చేసిన 10.00 లక్షల చొప్పున ఫిక్సిడ్ డిపాజిట్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందచేయటం జరిగిందని తెలియచేసారు. కోవిడ్ బాధితులకు అండగా హెల్ప్ ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ భాస్కర్, స్త్రీ శిశుసంక్షేమ శాఖ, గుంటూరు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అభినందించారు. ఈ కార్యక్రమం లో పలువురు కోవిడ్ -19 తో తల్లి / తండ్రి లేదా ఇద్దరు చనిపోయిన వారి కుటుంబాల వారు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గత ప్రభుత్వానిది స్కాముల్లో రికార్డు… కూటమి ప్రభుత్వానిది స్కీమల్లో రికార్డు

-పాడి రైతులు న్యూజిలాండ్ తరహాలో ప్రగతి సాధించాలి -గత ప్రభుత్వంలో నాయకుల సొంత డెయిరీలను పెంచుకున్నారు -తిరుపతి దుర్ఘటన విషయంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *