Breaking News

ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు మరింత పెరిగాలి…

-వైద్య సిబ్బందికి సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ ఆదేశం.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు మరింత పెరిగేలా చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. స్థానిక జిల్లా కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు,ఆరోగ్యశ్రీ సేవలు, లింగస్థ పిండ నిర్ధారణ పరీక్షల నియంత్రణ, తదితర అంశాలపై శనివారం విజయవాడ డివిజన్లోని సిహెచ్ సి, పి.హెచ్.సి., వైద్యులు, అధికారులతో సబ్ కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ మాట్లాడుతూ ప్రసవ సమయంలో మాతా, శిశు మరణాలు నియంత్రించేందుకు వైద్యులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా పేద కుటుంబాలకు చెందిన గర్భిణీలు ప్రసవాలకు ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తుంటారన్నారు. వారికి ఆరోగ్యకరమైన రీతిలో ప్రసవాలు జరిగి తల్లి, బిడ్డ క్షేమంగా ఉండేలా వైద్యులు సేవలందించి, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలపై ప్రజలలో మరింత నమ్మకం పెంపొందించే విధంగా వైద్యులు మెరుగైన వైద్య సేవాలందించాలన్నారు. సిహెచ్ సి, పి.హెచ్.సి.,లకు చెందిన ఏ ఎన్ ఎంలు అంగన్వాడీ సిబ్బంది సమన్వయంతో వారి పరిధిలోని గర్భిణీలు గర్భం ధరించిన దగ్గరనుండి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలకు హాజరయ్యేలా చూడాలని, రక్తహీనత, పౌష్టికాహార లోపాలను ముందుగానే గుర్తించి వాటి నివారణకు ముందుగానే చర్యలు తీసుకుంటే మాతా, శిశు మరణాలు గణనీయంగా తగ్గించవచ్చని, సిబ్బంది ఈ దిశగా కృషిచేయలన్నారు. సిహెచ్ సి, పి.హెచ్.సి.,లకు పెండింగులో ఉన్న ఆరోగ్యశ్రీ నిధులు వెంటనే విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ ను సబ్ కలెక్టర్ ఆదేశించారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు నేరమని, ఈ చట్టం అమలుపై ప్రజలకు మరింత అవగాహన కలిగించేందుకు ప్రతీ నెలా మూడో శనివారం సిహెచ్ సి, పి.హెచ్.సి., సబ్ సెంటర్ల, పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వైద్య సిబ్బంది పోస్టుల ఖాళీలు, ఆసుపత్రులకు అవసరమైన వైద్య పరికరాలు, నిర్మాణ పనులు, తదితర అంశాలపై వైద్యాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సి.హెచ్.సి.లకు సిటీజీ యంత్ర పరికరాలు అందించాలని వైద్యులు కోరగా, వెంటనే అందించేందుకు చర్యలు తీసుకోవాలని వైద్య శాఖాధికారులను సబ్ కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా వైద్య శాఖాధికారి డా.సుహాసిని, సిహెచ్ సి, పి.హెచ్.సి.,లకు చెందిన డాక్టర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గత ప్రభుత్వానిది స్కాముల్లో రికార్డు… కూటమి ప్రభుత్వానిది స్కీమల్లో రికార్డు

-పాడి రైతులు న్యూజిలాండ్ తరహాలో ప్రగతి సాధించాలి -గత ప్రభుత్వంలో నాయకుల సొంత డెయిరీలను పెంచుకున్నారు -తిరుపతి దుర్ఘటన విషయంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *