-కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే అన్నారు. శనివారం విజయవాడలో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నగరాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సూచించారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని కోరితే కేంద్ర ప్రభుత్వం కూడా అందుకు సహకరిస్తుందని అన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనపై విలేఖరులు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ… ఒక రాజధానిని అభివృద్ధి చేయడానికే రాష్ట్రానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని అలాంటిది మూడు రాజధానులు నిర్మించడం కష్టతరమని అథవాలే పేర్కొన్నారు. రాష్ట్రంలోని వృద్ధాశ్రమాలకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని నిధులు మంజూరు చేస్తుందని, అందుకు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రాష్ట్ర అభివృద్ధి తదితర అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చర్చించాలని అథవాలే సూచించారు.