Breaking News

నగర ప్రగతిపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-మధురానగర్లో రూ.35.76 లక్షలతో యూజీడీ పైపులైన్ పనులకు శంకుస్థాపన
-వైకాపా ప్రభుత్వ హయాంలోనే నగర అభివృద్ధి: మేయర్ రాయన భాగ్యలక్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను పటిష్ట పరిచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. మధురానగర్లోని రామాలయం వీధి, కేదార్ వారి వీధులలో రూ. 35.76 లక్షల నిధులతో నిర్మించతలపెట్టిన యూజీడీ పైపు లైన్ ఏర్పాటు పనులకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. కాలనీలలో రోజురోజుకు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరింపజేస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణంతో వీధులు, రహదారులు పరిశుభ్రంగా ఉంటాయని పేర్కొన్నారు. వర్షాకాలంలో కాలనీలలో మురుగునీటి ముంపు సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. త్వరలో మిగతా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి యూజీడీ పనులు చేపడతామని వెల్లడించారు.

విజ‌య‌వాడ న‌గ‌ర అభివృద్ధికి కావ‌ల‌సిన‌న్ని నిధులు కేటాయించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జ‌గన్మోహ‌న్ రెడ్డి సుముఖంగా ఉన్నార‌ని మ‌ల్లాది విష్ణు తెలిపారు. గ‌త తెలుగుదేశం ప్రభుత్వం ఒకే ప్రాంతంపై దృష్టి కేంద్రీక‌రించి.. మిగ‌తా ప్రాంతాల‌ను పూర్తి నిర్లక్ష్యానికి గురిచేసింద‌న్నారు. కానీ ఈ ప్రభుత్వం న‌గ‌ర‌ ప్రజల సౌకర్యం కోసం రూ. వందల కోట్ల నిధులను ఖ‌ర్చు చేస్తోంద‌న్నారు. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌హ‌కారంతో నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని ప్రాంతాల‌లో మురుగునీటి పారుదల వ్యవస్థ, సౌకర్యవంతమైన రహదారులు, పుష్కలమైన తాగునీరు, మెరుగైన విద్యుత్‌ వ్యవస్థ వంటి మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అభివృద్ధి పనులలో ప్రజలు సైతం భాగస్వాములై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు. తద్వారా పనులు మరింత నాణ్యతతో పూర్తి చేసే అవకాశాలుంటాయన్నారు.

న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్యల‌క్ష్మి మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రతి వారం ఏదో ఒక ప్రాంతంలో అభివృద్ధి ప‌నుల‌కు ప్రారంభోత్సవాలు, శంకుస్థాప‌న‌లు చేసుకోవ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ఈ ప్రగ‌తిని న‌గ‌ర ప్రజ‌లు గ‌మ‌నించాల‌ని కోరారు.

డిప్యూటీ మేయ‌ర్ అవుతు శ్రీ శైల‌జారెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ కార్పొరేట‌ర్లు నిత్యం ప్రజాక్షేత్రంలో ప‌ర్యటిస్తూ ప్రజల స‌మ‌స్యల‌కు ప‌రిష్కారం చూప‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి అహ‌ర్నిశ‌లు కృషి చేస్తున్న ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధ‌న్యవాదాలు తెలిపారు.

స్థానిక కార్పొరేట‌ర్ కొంగిత‌ల ల‌క్ష్మీప‌తి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ స‌హ‌కారంతో మ‌ధురాన‌గ‌ర్ ను త్వరలోనే ఒక మోడ‌ల్ డివిజ‌న్ గా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఇంటింటికీ తిరిగి చెత్త సేకరణ బుట్టలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైసీపీ న‌గ‌ర మ‌హిళ అధ్యక్షురాలు పిల్లి కృష్ణవేణి, నాయ‌కులు ఎస్.కె.బాబు, కొండ‌ల‌రావు, ద‌యానంద్, వెంగ‌య్య‌, గోవింద్, మోహ‌న్ రావు, దేవినేని శివాజీ, కోలా ర‌మేష్, స‌ముద్రపు గోవింద్, పిల్లి జ‌య‌కృష్ణ ప్రసాద్, దేవినేని సుధాక‌ర్, ఈఈ శ్రీనివాస్, వీఎంసీ అధికారులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *