జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని అర్హత ఉన్న ప్రతీ లబ్ధిదారుడు సద్వినియోగం చేసుకోవాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని అర్హత ఉన్న ప్రతీ లబ్ధిదారుడు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మాత్యులు  చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ, నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక వాంబే కాలనీ కమ్యూనిటీ హాల్ లో బుధవారం జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంలో లబ్ధిదారులకు రిజిస్టర్డ్ దస్తావేజులు పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి  చెరుకువాడ శ్రీరంగనాథరాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఓ టి ఎస్ ద్వారా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అందించాలని ఆలోచన చేసిన తొలి శాసనసభ్యులు మల్లాది విష్ణు అని మంత్రి అన్నారు. ప్రభుత్వ స్థలాలు కొని ఇండ్లను నిర్మించుకున్న వారు, కొండల అంచున నివాసాలు ఏర్పాటు చేసుకున్న ఏ ఆధారం లేని వారికి డాక్యుమెంట్స్ అందించాలని శాసనసభ్యులు మల్లాది విష్ణు ఎన్నోసార్లు ముఖ్యమంత్రి, తన దృష్టికి తీసుకు వచ్చారన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వన్ టైమ్ సెటిల్మెంట్ రూపకర్త శాసనసభ్యులు మల్లాది విష్ణు అని మంత్రి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అసలు, వడ్డీ వసూలు చేయాలని హౌసింగ్ కార్పొరేషన్ ను ఆదేశించారని మంత్రి అన్నారు. గతంలో46 వేల 300 మంది లబ్ధిదారులు 60 వేల రూపాయలు చెల్లించటం జరిగిందని మంత్రి అన్నారు. వివిధ కారణాలతో అమ్మిన వారి నుండి కొనుగోలు చేసిన వారు పేదవారు అయి అర్హత ఉంటే వారికి కూడా డాక్యుమెంటేషన్ హక్కు కల్పించేందుకు లీగల్ ఒపీనియన్ తీసుకొని పరిష్కరిస్తామన్నారు. ఓ టి ఎస్ విధానంలో డాక్యుమెంట్ కి సొంత ఆస్తి విలువ ఉంటుందని స్థలం తో పాటు ఆస్తి విలువ రెట్టింపు అవుతుంది అన్నారు. ఆస్తికి అసెస్మెంట్ నెంబర్ వస్తుందని దానితో అన్ని హక్కులు వర్తిస్తాయని అన్నారు. మామూలుగా రిజిస్ట్రేషన్ కైతే 70 నుండి 80 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని, ఓ టి ఎస్ పథకం ద్వారా నగరాల్లో 20 వేల రూపాయలు చెల్లిస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయడంతోపాటు 20 నుండి 30 లక్షల ఆస్తి కి హక్కుదారులు అవుతారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలకు సొంత ఇంటి కలను నిజం చేసేందుకు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టామని, గృహాలను కూడా లబ్ధిదారులు శరవేగంగా నిర్మాణాలు జరుపుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో లో 32 లక్షల మందికి గృహాలు అందించే కార్యక్రమం చేపట్టామని ఇప్పటికే 15 లక్షల అరవై వేలు గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి అన్నారు. భూ సేకరణకే రాష్ట్ర వ్యాప్తంగా 12 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, కృష్ణా జిల్లాలోనే 2,500కోట్ల రూపాయలు భూసేకరణకు ఖర్చు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. రహదారులు, త్రాగు నీరు ,విద్యుత్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తదితర మౌలిక వసతులకు 32 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. నిర్మాణ ప్రగతిపై ప్రతివారం సమీక్షిస్థున్నామని మంత్రి అన్నారు. గృహ నిర్మాణాలు పూర్తయ్యాక వాటి విలువ దాదాపు నాలుగు లక్షల కోట్ల ఆస్తి విలువ ఉంటుందని మంత్రి అన్నారు. బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తున్నామని, 24 గంటల్లోనే దశలవారీగా చెల్లింపులు జరుగుతున్నట్లు మంత్రి వివరించారు. పేదవాడి సొంత ఇంటి కలను ముఖ్యమంత్రి నిజం చేస్తున్నారని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి రంగనాథ రాజు కోరారు. స్థానిక శాసనసభ్యులు మల్లాది విష్ణు మాట్లాడుతూరాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పేదవాడు సొంతింటి కలను నెరవేరుస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదే అని అన్నారు.జగనన్న సంపూర్ణ గృహ పథకం ద్వారా వాంబే కాలనీ లో ఫిఫ్త్ బ్లాక్ లో నివాసాలు ఉన్నవారికి ఒకే మాటతో ఇంటివారిని చేసిన ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. 462 మందికి పైగా లబ్ధిదారులు గతంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని 20వేల రూపాయలు నామ మాత్ర రుసుం తో సొంతింటి గృహహక్కును నిజం చేశామన్నారు.గతంలో 105 మంది లబ్దిదారులు 60 వేల రూపాయల చెల్లించారని శాసనసభ్యులు అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కాని ఫిఫ్త్ బ్లాక్ నిర్వాసితుల సమస్య నేటితో పరిష్కారం అయిందని శాసనసభ్యులు అన్నారు. జిల్లా కలెక్టర్ జె. నివాస్ మాట్లాడుతూ ఓ టి ఎస్ ద్వారా రిజిస్ట్రేషన్ ఇబ్బందులు వీటితో పరిష్కారం అవుతాయన్నారు. సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ చేసుకునే గొప్ప పథకం ఓ టి ఎస్ అని , తద్వారా రిజిస్ట్రేషన్ ఖర్చులు ఆదా అవుతాయని అన్నారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఓ టి ఎస్ ద్వారా మంచి సదవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని, ఇది లబ్ధిదారుల పాలిట వరం లాంటిది అని అన్నారు. కార్యక్రమంలో 402 మంది లబ్ధిదారులకు వన్ టైమ్ సెటిల్మెంట్ లో లబ్ధిదారులకు రిజిస్టర్ డాక్యుమెంట్ పట్టాలను మంత్రి అందించారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ హౌసింగ్ నుపుర్ అజయ్ కుమార్, సబ్ కలెక్టర్ జి ఎస్ ఎస్ ప్రవీణ్ చంద్, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవి వెంకట్రావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *