విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలో చేపట్టిన ‘ఉదయపు వాడ-బాట’ కార్యక్రమంలో భాగంగా సోమవారం అనగా 21-02-2022 న 9వ డివిజన్ పటమటలంక స్క్రూ బ్రిడ్జి సర్వీస్ రోడ్డులో తూర్పు నియోజకవర్గ ఇన్-ఛార్జ్ దేవినేని అవినాష్ పర్యటించినప్పుడు హైవే అథారిటీ వాళ్ళు రోడ్డు తవ్వి మట్టి ని వేయడం వలన సర్వీస్ రోడ్డు లో వెళ్లేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు గురుంచి సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా అయన వివరించడం జరిగింది. అధికారులు కార్మికులను పంపించి ఆ మట్టి తొలగించి సమస్య పరిష్కరించడం జరిగింది. అవినాష్ కేవలం మూడు రోజుల్లో సమస్య పరిష్కరించి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొన్నారు అని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేసారు.
Tags vijayawada
Check Also
6.60 కోట్లతో నిర్మించనున్న జి.టి.యస్ పనులకు శంకుస్థాపన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో శాస్తీయ పద్దతిలో వ్యర్దాల నిర్వహణకు జి.టి.యస్ (గార్బేజ్ ట్రాన్స్ఫర్ సిస్టం) …