విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సొంత స్థలాలలో గృహనిర్మాణాల గ్రౌండింగ్ లక్ష్యాలు పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి శుక్రవారం మండల తహాసిల్దార్లు, ఎంపీడీవోలు, గృహ నిర్మాణ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ జె. నివాస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహ నిర్మాణాలపై వారం వారిగా సమీక్షిస్తూన్నామని అన్నారు.దీనిలో భాగంగా జిల్లాలో సొంతింటి స్థలం కలిగిన 19,971 మంది లబ్ధిదారులకు గృహ నిర్మాణాలు చేపట్టాల్సి ఉందన్నారు. సొంత స్థలాలు కలిగిన లబ్ధిదారులకు గృహ నిర్మాణాల గ్రౌండింగ్ ప్రాధాన్యతగా తీసుకొని పెండింగ్ లేకుండా సంబంధిత మండల అధికారులు పూర్తి చేయాలన్నారు. మండలాల వారీగా పరిశీలిస్తే ప్రతీ మండలానికి కనీసం వంద వరకు సొంత స్థలాలు కలిగి గృహ నిర్మాణాలు చేపట్టవలసి ఉన్నాయని కలెక్టర్ అన్నారు. వారం వారీగా నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను కోరారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు డా. కె. మాధవిలత, శివ శంకర్, మోహన్ కుమార్, నుపూర్ అజయ్ కుమార్, ఉన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …