Breaking News

గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శం… : కలెక్టర్‌ జె.నివాస్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసి అవినీతి రహిత సమాజాభివృద్ధికి కృషి చేస్తున్న గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శమని జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ అన్నారు. నగరంలోని ఇరిగేషన్‌ కాంపౌండ్‌ రైతుశిక్షణా కేంద్రంలో శుక్రవారం గ్రామ/వార్డు సచివాలయల వివిధ అర్గనైజేషన్‌లతో వారు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్‌ జె.నివాస్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నామన్నారు. అవినీతికి, వివక్షకు తావు లేకుండా పాలన ప్రజలకు చేరువ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారన్నారు. పెన్షన్‌ నుండి రెషన్‌ వరకు, ఇంటి పట్టా నుండి త్రాగునీటి వరకు, వైద్యం,ఆరోగ్యం, రెవెన్యూ, భూములసర్వే, శిశుసంక్షేమం లాంటి ఎన్నో సమస్యలపై ప్రజలు సమర్పిస్తున్న ఆర్జీలను గ్రామ స్థాయిలోనే పరిష్కరిస్తున్నామన్నారు. అర్హత ఉన్న ప్రతీ లబ్ధిదారుడు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవడంలో సచివాలయంలోని ప్రతీ ఉద్యోగి తన వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని కలెక్టర్‌ అన్నారు. ఈ వ్యవస్థ గ్రామ స్వరాజ్యానికి పునాది లాంటిదని, గ్రామంలో 10 మంది ఉద్యోగాలు పొంది సమాజానికి సేవ చేస్తున్నమనే బావన కలుగుతుందన్నారు. 2019 సంవత్సరం సెప్టెంబరులో పరీక్షలను నిర్వహించి తక్కువ సమయంలోనే పారదర్శకంగా ఎంపిక చేసి నియామక పత్రాలను అందించామని కలెక్టర్‌ అన్నారు. అప్పటి నుండి నేటి వరకు వారు ఎదుర్కొంటున్న సమస్యలను అన్ని స్థాయిలోను పరిష్కరిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ముఖ్య కార్యదర్శి గౌరవ సమీర్‌శర్మ ప్రతీ రోజు నిర్వహించే కాన్ఫరెన్స్‌లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తుల ప్రొబేషనరీ ప్రతిపాదనలు పెండిరగ్‌ ఉండరాదని ఆదేశిస్తున్నారని కలెక్టర్‌ అన్నారు. దీనిలో భాగంగా జిల్లాలోని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల అర్హత ఆధారంగా ప్రొబేషనరీ ప్రకటించడం జరిగిందన్నారు. ఇంకను అర్హత ఉండి తమకు ప్రొబేషనరీ కల్పించలేదని సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిశీలిస్తానని కలెక్టర్‌ అన్నారు. కోవిడ్‌ సమయంలో విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగస్తులకు కారుణ్యనియమకాల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించామని కలెక్టర్‌ అన్నారు. ఈ సమావేశంలో ఎనర్జీ అసిస్టెంట్లు తమకు ప్రొబేషనరీ డిక్లరేషన్‌ పెండిరగ్‌ ఉందని కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ (అభివృద్ధి) ఎల్‌. శివశంకర్‌, జడ్పీ సిఇఓ పి సూర్యప్రకాష్‌రావు, డిపివో జ్వోతి, అడిషనల్‌ కమీషనర్‌ అరుణ, జిల్లాలోని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *