విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తక్కువ పెట్టుబడులతో పాడి పరిశ్రమను లాభసాటీగా చేసి రైతులను ప్రోత్సహించే విధంగా అవగాహన కల్పిస్తున్నామని ఏపి డైరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ పెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, ఏపి అమూల్ ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ బాబు ఏ అన్నారు.
నగరంలోని ఎ కన్వెషన్ హాల్‌లో శుక్రవారం ఏపి డైరీ డెవలప్‌మెంట్, రైతు సాధికార సంస్థ, నాబర్డ్, భూమిఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు నిర్వహించే 4వ అర్గానిక్ మహోత్సవాలను ఏపి డైరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ పెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, ఏపి అమూల్ ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ బాబు ఏ, జిల్లా కలెక్టర్ జె.నివాస్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా బాబు ఏ మాట్లాడుతూ పాడి పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. దీనిలో భాగంగా జగనన్న పాలవెల్లువ పథకం ద్వారా మహిళ పాడి రైతులను పారిశ్రామిక వేత్తలగా తీర్చిదిద్ది ఆర్థిక పురోభవృద్ధి దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. దేశంలోనే మన రాష్ట్రం పాల ఉత్పత్తిలో నాల్గవ స్థానంలో ఉందన్నారు. దీనిలో భాగంగా ప్రభుత్వ సహకార పాల డైరీలను అమూల్‌తో భాగాస్వామ్యం చేసి పాడి రైతుకు గిట్టుబాటు ధరతో ఆర్థిక భరోసా కల్పిస్తున్నామన్నారు. వెన్న శాతం ఆధారంగా లీటర్‌కు 75 రూపాయల వరకు చెల్లిస్తున్నామన్నారు. ప్రతీ 10 రోజులకు పాడి రైతుల ఖాతాలకు నగదు జమ చేస్తున్నామన్నారు. మహిళ పాడి రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేస్తున్నామని, పాడి గెదల కొనుగోలుకు సహాకార బ్యాంకుల ద్వారా చేయూత అందిస్తున్నామన్నారు. పాడి పరిశ్రమలో వస్తున్న అత్యాధునిక సౌకర్యాలు, పనిముట్లను పాడి రైతులు అవగాహన కల్పించుకుని వారి వ్యాపారాభివృద్ధిని పెంచుకునేందుకు ఇటువంటి ప్రదర్శనలు
ఉపయోగపడతాయన్నారు. జగనన్న పాలవెల్లువ పథకం ప్రారంభం నాటి నుండి నేటివరకు ఏడు జిల్లాలలో అమలు చేస్తున్నామని ఈ పథకం ద్వారా సుమారు లక్ష 92 వేల మంది పాడి రైతులు నమోదు అయ్యారన్నారు. నేటి వరకు 2.30 కోట్ల లీటర్ల పాలను సేకరించామన్నారు. రోజుకు 96,475 లీటర్లు పాల సేకరణ జరుగుతుందని ఇప్పటి వరకు 98.05 కోట్ల రూపాయలు పాడి రైతులకు చెల్లించామని ఆయన అన్నారు.
జిల్లా కలెక్టర్ జె. నివాస్ మాట్లాడుతూ రైతులకు, ప్రజలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శనల ద్వారా పరిచయం చేయవచ్చునన్నారు. రైతులు తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుని లాభాలను పొందాలని కలెక్టర్ అన్నారు. సేంద్రీయ వ్యవసాయం పట్ల ప్రతీ రైతు అవగాహన పెంచుకుని రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి ఆరోగ్యకర, పర్యావరణ అనుకూల ఉత్పత్తులను పండిరచాలని కలెక్టర్ కోరారు. నాలుగురోజుల పాటు నిర్వహించే ఈ ప్రదర్శనను జిల్లాలోని రైతులు తిలకించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ అన్నారు.
అనంతరం ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ఆసక్తిగా పరిశీలించి వివరాలను నిర్వహకులనుండి అడిగి తెలుసుకున్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …