-సంధ్య కంటి ఆసుపత్రిలో మార్చి 15 వరకు అందుబాటులో
-నేత్ర వైద్య చికిత్సలో అధునాతన సాంకేతిక ఆవిష్కరణలు
-మేనేజింగ్ డైరెక్టర్ మునగపాటి భార్గవ్‌రామ్ వెల్లడి
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
గడచిన మూడున్నర దశాబ్దాలుగా స్వర్గీయ డాక్టర్ ఎం.ఎన్.రాజు ఆధ్వర్యంలో నేత్ర వైద్య చికిత్సలో ఆధునికతను జోడించి వేలాది వైద్య చికిత్సలు విజయవంతంగా నిర్వహించి సామాన్యులను కంటి చూపును ప్రసాదించినట్లు సంధ్య కంటి ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ మునగపాటి భార్గవ్‌రామ్ తెలిపారు. ఎంవీపీ కాలనీ, జంక్షన్ హైవే దగ్గర ఇసుక తోటలో అత్యాధునికంగా నిర్మించిన సంధ్య కంటి ఆసుపత్రిలో ఆదివారంనాడు నిర్వహించిన విలేకరుల సమావేశంలో భార్గవ్‌రామ్ మాట్లాడుతూ… గడచిన 35 సంవత్సరాలుగా రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ఆధునిక పరికరాలు, సాంకేతికతతో కూడిన ఆధునిక చికిత్సలు అందించడం తమ ఆసుపత్రికే సాధ్యమైందని తెలిపారు. వైద్యం నిర్వహణలో మంచి ఫలితాలతో ఎంతోమంది పేదలు కంటిచూపుతో లోకాన్ని చూడగలిగారని పేర్కొన్నారు. విజయవాడలో స్థాపితమైన సంధ్య కంటి ఆసుపత్రికి సంబంధించి గడచిన మూడున్నర దశబ్ధాల కాలంలో ఆరు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందరికీ చూపు అనే నినాదంతో స్వర్గీయ డాక్టర్ ఎం.ఎన్.రాజు ఆలోచనలకు స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్థులకు మార్చి 15వ తేదీ వరకు ఆసుపత్రి కార్యాలయంలో విద్యార్థులు తమ గుర్తింపు కార్డును చూపించి రిజిస్ట్రేషన్ పొందిన యెడల వైద్యులతో ఉచిత కన్సల్టేషన్, లాసిక్ చికిత్సలపై రాయితీలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సౌకర్యాన్ని ప్రతి ఒక్క విద్యార్థినీ, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ముంబయ్‌కి చెందిన ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ శశికపూర్ మాట్లాడుతూ.. ప్రపంచంలో మారుతున్న అధునాతన లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకుని కంటి వైద్యం నిరుపేదలకు చేరువ చేయడం అభినందనీయం అన్నారు. అత్యాధునిక లాసిక్ చికిత్స కంటి వైద్య చికిత్సల కోసం సంధ్య కంటి ఆసుపత్రిలో తాను అందుబాటులో ఉంటానని వెల్లడించారు. లాసిక్ జర్మనీ టెక్నాలజీతో కూడిందని, ఈ సాంకేతికతతో 0.50 నుండి 10డి వరకు పవరు సరిదిద్దవచ్చని తెలిపారు. దీంతో సత్ఫలితాలు పొందేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. కళాశాల విద్యార్ధులు అందరూ వైద్య శిబిరాన్ని సందర్శించి నేత్ర పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. కంటి శుక్లం, గ్లూకోమా, రెటీనా, మెల్లకన్ను, పిల్లల కంటి సంరక్షణ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఉచిత పరీక్షల కోసం ఈ క్రింది హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని కోరారు. ల్యాండ్‌లైన్ నంబరు 0891 -2799555, సెల్ నంబరు 8121656555.