విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్ నందు స్వర్గీయ దేవినేని నెహ్రూ స్పూర్తితో మా సన్నిహితులు 14వ డివిజన్ వైస్సార్సీపీ అధ్యక్షులు శెటికం దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో శేషం బాలమ్మ, లంకలపల్లి ఈశ్వరమ్మ లకి ఉపాధి నిమిత్తం 30000 రూపాయల విలువ చేసే తోపుడు బండ్లను నిరుపేద కుటుంబాలకు జీవనోపాధి నిమిత్తం నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మా దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాజకీయలకతీతంగా విద్య,వైద్య,ఉపాధి రంగాలలో మా శక్తి మేర సేవ కార్యక్రమాలు చేపడుతున్నాం అని అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ సొంత నిధులతో ఇలాంటి సామజిక సేవ కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అండగా నిలవడం గర్వకారణం అని అన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,స్థానిక కార్పొరేటర్ చింతల సాంబయ్య,వుల నాసరయ్య,యర్రం శెట్టి సుబ్బయ్య,వేమ శివన్నారాయణ,ఫ్రూట్ మల్లి,తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …