విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి కార్ ఏసీ టెక్నిషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవిర్బావ కార్యక్రమాన్ని నగరంలోని బెంజిసర్కిల్‌లో ఆదివారం నిర్వహించినట్లు అమరావతి కార్ ఏసీ టెక్నిషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు, వీనస్ కార్‌కూల్ అధినేత అబ్దుల్ సమీవుల్లా తెలిపారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ముఖ్యఅతిధిగా హాజరై అమరావతి టెక్నీషియన్ నూతన లోగోను ఆవిష్కరించారు. ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, వైసీపి తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్, ఆళ్ళ చెళ్ళారావులు మాట్లాడుతూ వీరి అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. ప్రభుత్వం తరఫును ఏవిధమైన సహాయం కావాలన్నా అందజేయటానికి సిద్ధంగా వున్నామని, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షులు అబ్దుల్ సమీవుల్లా మాట్లాడుతూ మొదటిగా 100 మందితో ఈ అమరావతి టెక్నీషియన్స్ అసోసియేషన్‌ను ప్రారంభించామన్నారు. రానున్న రోజుల్లో 13 జిల్లాలలో విస్తరించే దిశగా కృషిచేస్తామన్నారు. అసోసియేషన్‌లో సభ్యులుగా ఉన్నవారికి జీవితభీమా, గుర్తింపు సర్టిఫికెట్లు, అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం తరపున అందాల్సిన సహాయ సహకారాలు అందేలా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అమరావతి కార్ ఏసీ టెక్నిషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ఖలీల్ సయ్యద్, వైస్ ప్రెసిడెంట్ వి.వి.అప్పారావు, సెక్రటరీ ఎస్‌కె.సాధిక్, కోశాధికారి అబ్దుల్ రజాక్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …