Breaking News

జిల్లాలో విజయవంతంగా పల్స్ పోలియో కార్యక్రమం…

-పకడ్బందీ ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రంగం.
-మూడు రోజులపాటు పల్స్ పోలియో కార్యక్రమం:
-పూర్తి స్థాయిలో వైద్యాధికారులు, వైద్య సిబ్బంది : ఆదివారం జరిగిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్లు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పల్స్ పోలియో కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా అమలు జరుగుతున్నది. జిల్లాలో 4 లక్షల 21 వేల 439 మంది 5 సంవత్సరాల లోపు వయస్సు గల చిన్నారులు ఉన్నారని గుర్తించారు. వీరికి పల్స్ పోలియో చుక్కలు వేసేందుకు 2 వేల 568 కేంద్రాల ఏర్పాటు చేసి 5 లక్షల 40 వేల డోసులను సిద్ధంగా ఉంచారు. జిల్లా కలెక్టర్ జె. నివాస్, జాయింట్ కలెక్టర్ ఎల్. శివశంకర్, విజయవాడ సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్. ప్రవీణ్ చంద్ , జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. సుహాసిని పల్స్ పోలియో కేంద్రాలను సందర్శించారు. జిల్లా కలెక్టర్ జె. నివాస్ గిరిపురం లోని అర్బన్ పి హెచ్ సి లో పల్స్ పోలియో కేంద్రాన్ని ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. జాయింట్ కలెక్టర్ ఎల్. శివశంకర్ విజయవాడ పడమట లోని వార్డ్ సచివాలయంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాన్ని ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. సబ్ కలెక్టర్ జి.ఎస్. ఎస్. ప్రవీణ్ చంద్ క్రీస్తురాజుపురం అర్బన్ పి హెచ్ సి లో పల్స్ పోలియో కేంద్రాన్ని ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆదేశాల ననుసరించి జాయింట్ కలెక్టర్ ఎల్. శివశంకర్ పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం కోసం ప్రత్యేక కార్యాచరణ పధకాన్ని అమలు చేసారు. పల్స్ పోలియో కార్యక్రమంపై గ్రామ స్థాయి వరకూ విస్తృతంగా ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జె. నివాస్ మాట్లాడుతూ జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణకు వైద్యులు, సూపర్ వైజర్, వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు కలిపి మొత్తం 10 వేల 978 మంది సిబ్బందికి విధులు కేటాయించామన్నారు. వీరే కాక సచివాలయ సిబ్బంది, స్వచ్చంద సంస్థల సేవలను కూడా వినియోగించుకుంటున్నామన్నారు. మొదటిరోజు ఆదివారం ఎంపిక చేసిన కేంద్రాల్లో పోలియో చుక్కలు వేస్తారని, తదుపరి రెండు రోజులు అనగా సోమ, మంగళ వారాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు అందిస్తారని తెలిపారు. విజయవాడలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా నాలుగో రోజైన బుధవారం కూడా పోలియో వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. పోలియోకేంద్రాల్లో వ్యాక్సినేషన్ కొరత ఏర్పడకుండా సకాలంలో వ్యాక్సిన్ అందించేందుకు 63 రవాణా బృందాలను ఏర్పాటు చేశామని, . పల్స్ పోలియో కేంద్రాలను పర్యవేక్షణకు 97 మొబైల్ బృందాలును నియమించామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *