చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త :
చాగల్లు మండలం నేలటూరు గ్రామంలో ఆదివారం ఉప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మౌలిక సదుపాయాలు ప్రారంభించిన రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి గ్రామస్తులు సహకరించాలని అన్నారు. గ్రామానికి చెందిన వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు గెడ శ్యామ్ కుటుంబ సభ్యులు సుమారు రెండు లక్షల రూపాయల ఆర్థిక నిధులతో ఉప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినందుకు ఆయన కుటుంబ సభ్యులను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మట్ట వీరస్వామి వై ఎస్ ఆర్ సి పి పార్టీ అధ్యక్షులు చెల్లింకుల దుర్గా మల్లేశ్వర రావు వైయస్సార్ సిప పార్టీ గౌరవ అధ్యక్షులు జుట్ట ఏడుకొండలు ఆత్మ అధ్యక్షులు జి సురేంద్ర తాలూరి దామోదరం సుంకర రాయుడు ఆత్కూరి గోపి డాక్టర్ లక్ష్మీ ప్రియ. ఇందు ప్రియ ఆరోగ్య సిబ్బంది తాసిల్దార్ ఎం శ్రీనివాసరావు ఎంపీడీవో రాంప్రసాద్ పంచాయతీ కార్యదర్శి ఆలీ ప్రభుత్వ అధికారులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Tags chagallu
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …