విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని ముత్యాలంపాడు, గవర్నమెంట్ ప్రెస్‌రోడ్డులో గల రియా పాలి క్లినిక్‌నందు ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎపి ఫైబర్‌నెట్ ఛైర్మన్ గౌతమ్‌రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రికి వెళ్ళాలంటే ఖర్చులకు భయపడే ఇప్పటి రోజుల్లో ఏమాత్రం లాభాపేక్షలేకుండా రియా పాలి క్లినిక్ వారు ఇటువంటి ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. భవిష్యత్‌లో ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు రియా పాలి క్లినిక్ ద్వారా మరింత వైద్యసేవలు అందిస్తూ అభివృద్దిచెందాలన్నారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ దేవినేని అవినాష్ అభినందనలు తెలిపారు. క్లినిక్ నిర్వాహకులు డాక్టర్ సిహెచ్ కీర్తి, డాక్టర్ రాజాచంద్ర కాంత్‌లు మాట్లాడుతూ ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలతో అనుభవజ్ఞులైన డాక్టర్లచే లాభాపేక్ష లేకుండా అందుబాటు ధరలతో రియా పాలి క్లినిక్‌లో వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. నగర ప్రజలకు మరింత వైద్యసేవలు అందించాలనే ఉద్దేశ్యంతో వివిధ విభాగాలలో వైద్య నిపుణులైన ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు. నగర ప్రజలేకుండా చుట్టూ ప్రక్కల ప్రాంతాల నుండి వచ్చి తమ సేవలు వినియోగించుకున్నారన్నారు. ఈ శిబిరంలో డాక్టర్ కన్సల్టేషన్, బిపి మరియు షుగర్ పరీక్షలు ఉచితంగా చేస్తూ ల్యాబ్ పరీక్షలపై ప్రత్యేక తగ్గింపునిస్తున్నామన్నారు. గుండె, ఊపరితిత్తులు, కీళ్ళు, ఫిజియోథెరపీ, మూత్రపిండాలు, మెదడు, నరాలు, జీర్ణకోశవ్యాధులు, పోషకాహార సమస్యలు, స్త్రీలవ్యాధులు, సంతానలేమి సమస్యలు, జనరల్ సర్జరీ, అధిక, అల్పబరువు, షుగర్, బిపి అని రకాల జరాలు, సంబంధిత వ్యాధులకు ప్రత్యేక వైద్య నిపుణులచే ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ఈ శిబిరంలో డాక్టర్లు సిహెచ్.కీర్తి, ప్రత్యూష వీర్నాల, డి.గౌతమీ, రబ్బానీ షేక్, బి.వి.గుర్నాథశర్మ, మౌనిక, టి.సత్యప్రియ, జి.అన్వేష, జి.శరత్‌బాబు, ఎం.గోపీచంద్, బి.హర్షాబాయ్ తదితరులు వైద్యపరీక్షలు నిర్వహించి సలహాలు సూచనలు, మందులు అందజేశారు. ఈ వైద్యసేవలు భారీ సంఖ్యలో వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసులు వారువచ్చి శిబిరంలో వైద్యసేవలను వినియోగించుకున్నారు. క్లినిక్ డాక్టర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొని వైద్యసేవలు అందించారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …