విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలో స్వర్గీయ దేవినేని నెహ్రూ స్పూర్తితో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ వైయన్ఆర్ చారిటీస్ ద్వారా ఎందరో నిరుపేదలకు జీవనోపాధి కల్పించడం తో పాటు ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్న యలమంచిలి జయ ప్రకాష్ సేవలు అభినందనీయం అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. సోమవారం వై.యన్.ఆర్ చారిటీస్ ద్వారా 20 మంది మహిళలకు జీవనోపాధి నిమిత్తం కుట్టుమిషన్లు తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు చేతులుమీదగా అందించారు. ఈ సందర్భంగాఅవినాష్ మాట్లాడుతూ దేవినేని నెహ్రూ హయం నుండి కూడా యలమంచిలి జయ కు మా కుటుంబంతో ఉన్న సన్నిహిత్యంతో తాను చేపట్టే ప్రతి సామాజిక సేవ కార్యక్రమంలలో నన్ను భాగస్వామినీ చేయడం సంతోషంగా ఉందని, నాన్నగారు దేవినేని నెహ్రు గారి సేవా స్పూర్తితో తన చారిటీ సంస్థ ద్వారా ఎన్నో వేల మందికి ఉపాధి, విద్య రంగాలలో అండగా నిలిచిన వారి సేవలు అభినందనీయం అని అన్నారు.రాబోయే రోజుల్లో కూడా వారి సేవ కార్యక్రమాలు ఇలాగే నిరాటంకంగా జరగాలని వారికి నా పూర్తి సహాయసహకారాలు ఉంటాయని తెలిపారు. ఆ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జయ ప్రకాష్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని అవినాష్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు మూల్పూరి ఉపేంద్ర, జొని కుమారి, దేవినేని కిశోరె, పర్వతనేని సుభాష్, కార్పొరేటర్లు అంభనపూడి నిర్మలా కుమారి, భీమిశెట్టి ప్రవళికా, మెరకనపల్లి మాధురి, రెహానా నాహిద్, అంబెడ్కర్, వియప్పు అమర్నాధ్, చింతల సాంబయ్య, తాటిపర్తి కొండారెడ్డి, డివిజన్ ఇన్ ఛార్జ్ గలా పద్మావతి, కొత్తపల్లి రజని, మాగంటి నవీన్ వైస్సార్సీపీ నాయకులు ఆళ్ల చెల్లారావు, గల్లా రవి, చిమటా బుజ్జి, ధనేకుల కాళేశ్వరరావు , సోంగా రాజకమల్, బొచ్చు మురళి తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …