-రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ మాత్యులు వెలంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పాలకసంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ మాత్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ శ్రీ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్, శాప్, ఇరిగేషన్ మరియు నగర పాలకసంస్త అధికారులతో సమీక్షించినారు. విధ్యాధరాపురం నందు స్టేడియం నిర్మాణo మరియు కృష్ణానది పరివాహక ప్రాంతమైన భవాని ఘాట్ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పై అధికారులతో చర్చించి వివరాలు అడిగితెలుసుకుని పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో సిటి ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, ఎస్.ఇ నరసింహ మూర్తి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె. నారాయణ మూర్తి, మరియు శాప్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.