-రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ మాత్యులు వెలంపల్లి శ్రీనివాసరావు
-గత పాలకుల నిర్లక్షమే – నగర అభివృద్ధి కుంటి పడింది
-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 43వ డివిజన్ నందు రూ.211.84 లక్షలతో అభివృద్ధి పరచిన పలు రోడ్ల ప్రారంభ కార్యక్రమములో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్ మరియు స్థానిక కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డి పాల్గొన్నారు. డివిజన్ పరిధిలో రూ.142లక్షల 14వ ఆర్ధిక సంఘ నిధులతో హెచ్.బి.కాలనీ మెయిన్ రోడ్ నుండి సిద్ది అపార్ట్ మెంట్ వరకు, రోజ్ పార్క్ ప్రాంతములో సి.సి. రోడ్లుగా అభివృద్ధి పరచిన పలు అంతర్గత రోడ్లు మరియు రూ.100 కోట్ల గ్రాంట్ నిధుల నుండి రూ.50 లక్షల అంచనాలతో సిద్ది అపార్ట్ మెంట్ క్రాస్ రోడ్, అక్షర స్కూల్ రోడ్ మరియు రూ.19.84 లక్షల నగరపాలక సంస్థ సాధారణ నిధులతో పూర్తి చేసిన బి.టి హాట్ మిక్స్ రోడ్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ అభివృద్ధియే లక్ష్యంగా వై.సి.పి ప్రభుత్వం పని చేస్తూందని, డివిజన్లలో ప్రజల అవసరాలకు అనుగుణంగా పలు అభివృద్ధి పనులు చేపట్టి వాటి సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం జరుగుతుందని పేర్కొన్నారు. భవానిపురం ప్రాంత వాసుల చిరకాల కోరిక స్టేడియం దానిని కూడా మా హయంలో అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు.
అదే విధంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్షమే నగర అభివృద్ధి కుంటి పడిందని, మేము అధికారం చేపట్టినప్పటి నుండి నగరంలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి శంకుస్థాపన చేయడమే కాకుండా వాటిని సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోనికి తీసుకురావటం జరుగుతుందని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో మంత్రిగారి, సెంట్రల్ నియోజకవర్గంలో శాసన సభ్యులు మరియు తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గార్ల నిరంతర కృషితో నగర అభివృద్ధికి చక్కటి ప్రణాళికలతో అభివృద్ధి దిశగా ఈ ప్రభుత్వం పని చేస్తూందని పేర్కొన్నారు.
అనంతరం డివిజన్ పరిధిలో గల ఖాళి స్థలములు, ఐరన్ యార్డ్ మొదలగు పలు ప్రదేశాలలో పర్యటించి స్థానికంగా ఎదురౌతున్న ఇబ్బందులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొన్నారు.
కార్యక్రమములో 40వ డివిజన్ కార్పొరేటర్ యారడ్ల ఆంజనేయ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.నారాయణమూర్తి, ఇతర అధికారులు సిబ్బంది మరియు స్థానికులు, వై.సి.పి శ్రేణులు పాల్గొన్నారు.