విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ వర్ధంతిని సోమవారం విజయవాడ ఆంధ్ర రత్న భవన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాజేంద్రప్రసాద్ 1931 లో జరిగిన ఉప్పు సత్యాగ్రహం, 1941లోజరిగిన క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొని జైలుశిక్ష అనుభవించారని , 1946 ఎన్నికల తరువాత ఆహారం, వ్యవసాయం శాఖకు భారతప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించారని, భారత రాజ్యాంగ నిర్మాణ శిల్పి. 1948 నుండి 1950 వరకు భారత రాజ్యాంగ ముసాయిదా తయారీ కోసం ఏర్పరచబడిన సంఘానికి అధ్యక్షత వహించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ వళిబొయిన గురునాధం, నగర అధ్యక్షుడు నరహారశెట్టి నరసింహారావు, రాష్ట్ర కార్యదర్శి & కార్యాలయం ఇంచార్జి నూతలపాటి రవికాంత్, హ్యూమన్ రైట్స్ చైర్మన్ మన్నం రాజశేఖర్, నగర ఉపాధ్యక్షుడు మేళం చిన్నా తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
6.60 కోట్లతో నిర్మించనున్న జి.టి.యస్ పనులకు శంకుస్థాపన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో శాస్తీయ పద్దతిలో వ్యర్దాల నిర్వహణకు జి.టి.యస్ (గార్బేజ్ ట్రాన్స్ఫర్ సిస్టం) …