ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలి… : కలెక్టర్ జె నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. ఏప్రిల్ 22 నుండి మే12 తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై శనివారం నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ -19 దృష్ట్యా మార్గదర్శకాలను అనుసరించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షల నిర్వహణ పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.
ఈ పరీక్షల్లో భాగంగా ఈ నెల ఏడో తేదీ సోమవారం ఉదయం ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, ఈనెల తొమ్మిదో తేదీ బుధవారం ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ పరీక్షలు ఉంటాయని వీటిని తప్పనిసరిగా ప్రతి విద్యార్థి హాజరై ఉత్తీర్ణత కావలసి ఉంటుందని ఆర్ఐఓ రవికుమార్ అన్నారు. ప్రాక్టికల్ పరీక్షలు ఈనెల 11వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉదయం 9 గంటలకు 12 గంటల వరకు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండు సెక్షన్లో జరుగుతాయన్నారు.ఈ పరీక్ష నిర్వహణకు 91 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, 40,687 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారన్నారు. వీరిలో ఎంపీసీ విద్యార్థులు 29,184 బైపీసీ విద్యార్థులు 11,503 మంది ఉన్నారన్నారు. ఒకేషనల్ ప్రాక్టికల్ ఎగ్జామ్ కు మొదటి ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి 5,071 మంది పరీక్షలు రాయనున్నట్లు ఆర్ఐ వో రవికుమార్ కలెక్టర్ కు వివరించారు.
ఏప్రిల్ 22వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు, ప్రథమ, ద్వితీయ సంవత్సరం థియరీ పరీక్షలు జరగనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణ సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే పరీక్ష ప్రశ్నపత్రాలు భద్రత, పంపిణీ పరీక్ష కేంద్రాల వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటుచేయాలని పోలీసు అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు, అవసరమైన మందులతో వైద్య బృందాలను ఏర్పాటుచేయాలని వైద్య ఆరోగ్య శాఖాధికారులకు ఆదేశించారు. ప్రాక్టికల్, థియరి పరీక్షలకు ఫ్లయింగ్ స్క్వాడ్ గా ఉప తహసీల్దార్లను నియమించాలని, అలాగే పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారిని ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వర్లు, ఆర్ఐఓ రవికుమార్, నగర పాలక సమస్త అడిషనల్ కమిషనర్ జె అరుణ, డి ఈ ఓ తహేర సుల్తానా తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *