Breaking News

ఎపిజిఇఎస్‌ఎ ఆధ్వర్యంలో ‘బ్లాక్‌ డే’ నిరసన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ఉద్యోగుల 11వ పిఆర్‌సిలో ఉద్యోగ సంఘ నాయకులు సాధించిన విజయాలను నేటికీ బహిరంగంగా చెప్పకపోవడం శోచనీయమని, ఆ విజయాలను గురించి వెంటనే ఉద్యోగ సంఘ నాయకులు ఉద్యోగ లోకానికి తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌ అసోసియేషన్‌ (ఎపిజిఇఎస్‌ఎ) రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శులు వినుకొండ రాజారావు, కొండపల్లి శ్రీనివాసరావులు అన్నారు. ఆదివారం బందరురోడ్డులోని వారి కార్యాలయంలో ‘బ్లాక్‌ డే’ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వినుకొండ రాజారావు, కొండపల్లి శ్రీనివాసరావులు మాట్లాడుతూ బీఆర్టీఎస్‌రోడ్డులో జరిగిన నిరసన కార్యక్రమంలో కొందరు నాయకులు ప్రభుత్వాన్ని అనరాని మాటలు, కించపరిచే వ్యాఖ్యలు, సత్తా చూపిస్తామనే మాటలు మాట్లాడి ఇదంతా మా బలమేనని ప్రభుత్వం కనుసన్నల్లో పడటానికి విశ్వ ప్రయత్నం చేసి, ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిన రోజు, వంచన చేసినరోజు ఫిబ్రవరి 6వ తేదీని ‘నయవంచన దినం’గా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ప్రతినెలా 6వ తేదీన రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక్కొక్క నెలలో 13 జిల్లాల్లో జరుపుతామని, దీని ద్వారా ఉద్యోగులను చైతన్యం చేసి మరో పిఆర్‌సిలో అన్యాయం జరగకుండా ఉద్యోగ వ్యవస్థను కాపాడి భవిష్యత్తు తరములకు మంచి బాటలు వేసేలా కృషి చేస్తామన్నారు. మంచి నాయకత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని, వచ్చే పిఆర్‌సికి అన్ని రిజిష్టరు సంఘాలను ప్రభుత్వం అనుమతించాలని, సాక్షాత్తు న్యాయస్థానం పిఆర్‌సి నివేదిక బహిరంగపర్చాలని ఉత్తర్వులు ఇచ్చిందని అందుకు న్యాయస్థానానికి, రాష్ట్ర ఉద్యోగులందరి పక్షంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. నాయకుల వైఫల్యమే ఉద్యోగులకు శాపంగా మారిందన్నారు. గతంలో అనేక మంది నాయకులకు ఉద్యోగుల సంక్షేమమే ఎజెండాగా వుండేదని వారిని స్ఫూర్తిగా తీసుకుని నాయకులుగా ఎదగాలన్నారు. ఉద్యోగులకు సాధించి పెట్టిన అంశాలు ఏమైనా వుంటే వాటిని ఉద్యోగ లోకానికి చెప్పాలన్నారు. ఇటు ఉద్యోగులను, అటు ప్రభుత్వాన్ని మోసం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. అందుకే ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మచ్చా నాగరాజు, జిఎస్‌ఎల్‌ శ్రీనివాస్‌, కోటా రవి, బి.సురేష్‌, ఎన్‌కెవి.ప్రసాద్‌, వెంకటేశ్వరనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *