విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
“ఎప్పుడైతే అన్ని రంగాలలో మహిళలు ముందు ఉంటారో అప్పుడు దేశం ముందుకు సాగుతుంది” అని ఎక్సెల్ల ఎడ్యుకేషన్ గ్రూప్ వ్యవస్థాపకుడు/చైర్మన్ అరవింద్ అరసవిల్లి అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం ఓ ప్రకటన విడుదల చేసారు. అరవింద్ అరసవిల్లి మాట్లాడుతూ మహిళా సాధికారత అంటే సంక్షోభ సమయంలో అనేక విధాలుగా మహిళల్లో అంతులేని శక్తిని మరియు ధైర్యాన్ని పెంపొందింపచేయడమన్నారు. ఎక్సెల్ల ఎడ్యుకేషన్ గ్రూప్‌లో మహిళలు స్వేచ్ఛను ఆస్వాదిస్తారు మరియు వారి నిర్ణయాలను స్వేచ్చగా వెల్లడిస్తారు. ఎందుకంటే వారి జీవితానికి మరియు భవిష్యత్తుకు వారే సరైన నిర్ణయ కర్తలు అని మేనేజ్‌మెంట్ విశ్వసిస్తుందదన్నారు. మహిళలకు సాధికారత కల్పించడం అనేది మహిళలను సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల మరియు లింగ ఆధారిత వివక్షల నుండి విముక్తులను చేయడమే. పురుషుల మాదిరిగానే స్త్రీలు సమాన హక్కులు మరియు అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఎక్సెల్ల లో అమ్మాయిలు/మహిళలు తమ శక్తిని ఎటువంటి వివక్ష లేకుండా పూర్తి స్థాయిలో ప్రదర్శించగలరన్నారు. ఎక్సెల్ల గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ‘మహిళల సాధికారత’ అనే స్పష్టమైన ఉద్దేశ్యాన్ని మరియు మేనేజ్మెంట్ మహిళల గౌరవానికి భంగం వాటిల్లకపోవడాన్ని మనం చూడవచ్చన్నారు. ఎక్సెల్ల సిబ్బందిలో ఎక్కువ మంది మహిళలు ఉండటం మరియు మహిళలే కీలక స్థానాల్లో ఉండటం చూస్తే ఎక్సెల్ల మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అద్దం పడుతుందన్నారు. ఎక్సీల్లా ఎడ్యుకేషన్ గ్రూప్స్ యొక్క సీఈఓ ఆర్.సౌజన్య అత్యున్నత స్థాయి కార్యనిర్వాహకురలిగా సంస్థ యొక్క మొత్తం కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు మరియు కార్పొరేట్ నిర్ణయాలలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. హ్యూమన్ సోర్స్ మేనేజర్ నజీమా బేగం విజయవాడ, హైదరాబాద్, గుంటూరు మరియు వైజాగ్ శాఖలలో చురుకుగా ఉద్యోగులను రిక్రూట్ చేయడం, స్క్రీనింగ్ చేయడం, ఇంటర్వ్యూ చేయడంతో పాటు మేనేజ్మెంట్ మరియు ఉద్యోగులకు మధ్య వారధిగా సమర్థవంతంగా విధులను నిర్వహిస్తున్నారన్నారు. ఇంకా వైజాగ్ లో దివ్య, హైదరాబాద్ లో శ్రావ్య, గుంటూరులో ప్రవల్లిక, మరియు విజయవాడ లో ప్రియాంక వీరంతా బ్రాంచ్ మేనేజర్లు గా అంతర్జాతీయ విద్యను కోరుకునే విద్యార్థులకు సహాయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ఈ మహిళలు సంస్థ యొక్క ముఖ్యమైన విధులను నిర్వహిస్తున్నారు. మిగిలిన వారు వివిధ విభాగాలలో ఉన్నారన్నారు. నా ఏకైక ఉద్దేశ్యం స్త్రీ మనోబలాన్ని, శక్తి ని పెంపొందింపజేయడం. అందువల్ల కంపెనీలో సీఈఓ నుండి జూనియర్ కౌన్సెలర్ల వరకు వివిధ స్థానాలు మహిళలకు మాత్రమే కేటాయించడం జరిగిందన్నారు. “మహిళలు ప్రతీ రంగంలో వెలుగొందాలి మరియు ఉన్నత శిఖరాలను అందుకోవాలి” అన్నారు. ఎక్సెల్ల ఎడ్యుకేషన్ గ్రూప్స్ వ్యవస్థాపకుడు/చైర్మన్ అరవింద్ అరసవిల్లి పేర్కొన్నారు.
Tags vijayawada
Check Also
6.60 కోట్లతో నిర్మించనున్న జి.టి.యస్ పనులకు శంకుస్థాపన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో శాస్తీయ పద్దతిలో వ్యర్దాల నిర్వహణకు జి.టి.యస్ (గార్బేజ్ ట్రాన్స్ఫర్ సిస్టం) …