విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చట్టసభల్లో, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం పైగా రిజర్వేషన్లు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్నారన్నారని, మహిళలు అన్ని రంగాల్లో ఎదుగుదలకు పురుషులు సహకరించాలని తాతినేని పద్మావతి ఛైర్‌పర్సన్, ఎపిఎస్‌ఆర్‌టిసి విజయవాడ రీజియన్ అన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం తమ చాంబర్లో పాత్రికేయుల సమావేశం నిర్వహించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా టి.పద్మావతి మాట్లాడుతూ కుటుంబంలో మహిళ దిక్సూచిగా వ్యవహరిస్తుందని, కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది తద్వారా రాష్ట్రదేశ అభివృద్ధి సాధ్యమన్నారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్లో స్త్రీకి ప్రత్యేక స్థానం వుందన్నారు. 1910లో యూరప్‌లో మహిళల పని గంటలను తగ్గించాలంటూ చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకం. ఆ పోరాటంలో ఎంతో మంది మహిళలు ప్రాణాలు కూడా కోల్పోయారు. 1910 మార్చి 8వ తేదీన క్లారాజెట్కిన్ అనే ఉద్యమ నాయకురాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చిందని, అప్పటి నుంచి పలు దేశాల్లో మార్చి 8న మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందన్నారు. సీఎం వైయస్ జగన్ నేతృత్వంలో మహాసాధికారిత పరిఢవిల్లుతోందనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. ఆయన మహిళా సాధికారత కోసం చేపడుతున్న కార్యక్రమాలు, చేస్తున్న పనులు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయన్నారు. మహిళల రక్షణకోసం దిశచట్టాన్ని తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారన్నారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా ప్రభుత్వం నుండి అందించే ఏ సంక్షేమ పథకమైనా మహిళల ఖాతాలో వేసిన సందర్భం మనం చూశామా? కానీ, అమ్మఒడి మొదలు అన్ని రకాల సంక్షేమ పథకాల సొమ్మును నగదు బదిలీ ద్వారా నేరుగా మహిళల ఖాతాల్లో వేసిన ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. మహిళా దినోత్సవం మహిళలకు ఎంతో స్ఫూర్తి కలిగిస్తుందన్నారు. సమాజంలో మహిళల పట్ల నేటికి ఆగని కొన్ని దురాచారాలు, అన్యాయాలను వ్యతిరేకిస్తూ మహిళలు ముక్తకంఠంతో పోరాడాలన్నారు. అందుకు వేదికగా రాజకీయాలను ఎంచుకుని మహిళల అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. ఒక తల్లిగా, చెల్లిగా, భార్యగా వున్న ప్రతి మహిళకు మన ఇచ్చే గౌరవమే ఈ మహిళా దినోత్సవం అని అన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …