పని తీరుపై ఆలక్ష్యం ఉన్నా, తప్పులు చేసినా విచారణ జరిపి, శాఖ పరమైన చర్యలు తీసుకుంటాం…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కారం రాష్ట్ర స్థాయి సగటు (ఎస్ ఎల్ ఏ సగటు) లోపలే చెయ్యాల్సి ఉండగా మండల స్థాయి అధికారులు అందుకనుగుణంగా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి. ప్రసన్న వెంకటేష్ స్పష్టం చేశారు. పని తీరుపై ఆలక్ష్యం ఉన్నా, తప్పులు చేసినా విచారణ జరిపి, శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోమవారం స్థానిక మునిసిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో కొవ్వూరు డివిజన్ స్థాయి అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వి. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ, కొన్ని ఫిర్యాదులు తక్షణమే పరిష్కారం చెయ్యాల్సి ఉండగా ఎస్ ఎల్ ఏ లోపలే చెయ్యక పోవడం మీ పని తీరుకు నిదర్శనం అన్నారు. ఇదే పునావృతం అయితే ఫిర్యాదు వారీగా సమీక్ష చేసి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సమస్య పరిష్కారానికి చొరవ చూపకుండా , ఆలక్ష్యం చూపుతున్నారని తెలిపారు. స్పందన సమస్య పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధన్యత ఇస్తున్న విషయం దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఉద్దేశ్య పూర్వకంగా జాప్యం చేస్తే ఇంక్రిమెంట్ పై కోత వెయ్యడం జరుగుతుందన్నారు.

చాగల్లు మండలం లో రహదారి కోసం ఒకే వ్యక్తి పలుమార్లు ఫిర్యాదు చేయడంతో, సుబ్బారావు అనే ఫిర్యాది దారునితో కలెక్టర్ ఫోను లో మాట్లాడి, సమస్య పరిష్కారానికి ఇంకో డివిజన్ పరిధిలో ఉన్న అధికారితో దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని జేసి (రెవెన్యూ) ను కలెక్టర్ ఆదేశించారు.ఓటీఎస్, నీటి తీరువా వసూళ్లు లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. రోజు వారీ వసూళ్లు కోసం సచివాలయ సిబ్బందిని వినియోగించు కోవాలన్నారు.రెవెన్యూ వసూళ్ల ను పూర్తి చేస్తేనే రాష్ట్రానికి రెవెన్యూ వొస్తుందన్న విషయం గుర్తుంచు కోవాలన్నారు. ఈ పాస్ మిషన్లు మండలానికి ఒకటి పంపించి పన్నుల వసూళ్ల కి చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్హులైన లబ్దిదారులందరికి సాచ్యురేషన్ విధానంలో ఇళ్ళ స్థలాలు కేటాయించిన ఇంకా దరఖాస్తులు వొస్తున్నట్లఐతే అనర్హులను తొలగించాలన్నారు. గతంలో అనర్హులైన వారికేవరికైనా ఇళ్ళ స్థలాలు కేటాయించినట్లైతే వారి పేర్లను తొలగించి అర్హులకు కేటాయించాలని ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. కోర్ట్ కేసులు, అందులో కంటేప్ట్ ఆఫ్ కోర్ట్ కేసుల పై సమీక్షించారు. తాడిపూడి ప్రాజెక్ట్ పరిధిలో నీటి తీరువా వసూళ్లు, ఇతర అంశాలపై చర్చించి, తహశీల్దార్లు వ్యక్తిగతంగా క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల ఈ క్రాప్ నమోదు, కౌలు రైతుల రుణాలు, తదితర అంశాలపై కలెక్టర్ సూచనలు చేశారు.

సమావేశంలో ఉదయం పి.ఓ. ఎల్.ఆర్, స్పందన, రీ సర్వే, 90 రోజుల ఇళ్ల పట్టాలు కార్యక్రమం, నీటి తీరువా, వన్ టైం కన్వర్షన్, భూసేకరణ, కోర్టు కేసులు, వ్యవసాయం- అనుబంధ రంగాలపై సమీక్ష, తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ,(రెవెన్యూ) డా.బి ఆర్.అంబేద్కర్, జేసి హౌసింగ్ .. సూరజ్ గనోరే , ఆర్డీవో ఎస్.మల్లిబాబు, తహసీల్దార్ లు, మండల వ్యవసాయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *