కామినేనిలో విజయవంతంగా కిడ్నీ మార్పిడి


-అతి తక్కువ వ్యయంతో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్
-అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు, అనుభజ్ఞులైన నిపుణులతో నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాలు
-మరింత ఆధునికంగా డయాలసిస్ యూనిట్లు
-మీడియా సమావేశంలో కామినేని సీవోవో డాక్టర్ నవీన్ కుమార్ వెనిగళ్ల
-మూత్రపిండాల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి
-ప్రముఖ నెఫ్రాలజిస్టు డాక్టర్ సరిత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అత్యాధునిక వైద్య సేవలను అందించడంలో అగ్రగామిగా ఉన్న తాడిగడపలోని కామినేని హాస్పిటల్స్ నందు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేసినట్లు హాస్పిటల్స్ సీవోవో డాక్టర్ నవీన్ కుమార్ వెనిగళ్ల తెలిపారు. టిక్కిల్ రోడ్డులోని మనార్ ఫుడ్ ప్లాజాలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కామినేని అడ్వాన్స్డ్ నెఫ్రాలజీ విభాగంలో కిడ్నీ మార్పిడి చికిత్సను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. కానూరుకు చెందిన పొర్ల రామకృష్ణ (42) మూత్రపిండాలు పూర్తిగా దెబ్బతినడంతో తమ ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. పేషేంట్ ఆరోగ్య పరిస్థితిని విశ్లేషించిన అనంతరం కిడ్నీ మార్పిడి అవసరమని నిర్ధారించామని అన్నారు. రామకృష్ణ తల్లి తన కిడ్నీని ఇచ్చేందుకు ముందుకురావడంతో ప్రముఖ నెఫ్రాలజిస్టు డాక్టర్ సరిత, యూరాలజిస్టులు డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ మూర్తి నేతృత్వంలో రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సను నిర్వహించినట్లు తెలిపారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స అనంతరం పేషేంట్ ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్ నవీన్ వెల్లడించారు. ప్రముఖ నెఫ్రాలజిస్టు డాక్టర్ సరిత మాట్లాడుతూ ఈ కిడ్నీ మార్పిడి చికిత్సను అత్యంత తక్కువ వ్యయంతో నిర్వహించామని చెప్పారు. ఈనెల 10వ తేదీన వరల్డ్ కిడ్నీ డే జరుపుకుంటున్నామని అన్నారు.బీమూత్రపిండాల ఆరోగ్యం పట్ల ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అనుసరిస్తూ, క్రమబద్ధమైన జీవన విధానం అవలంభించడం ద్వారా కిడ్నీ వ్యాధుల బారినపడకుండా జాగ్రత్త వహించాలని అన్నారు. మధుమేహవ్యాధిగ్రస్తులు, స్థూలకాయంతో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. క్రమానుసారంగా వైద్యులను సంప్రదించి, వారి సలహాలను పాటిస్తే కిడ్నీ వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చని చెప్పారు. కామినేనిలోని నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాల్లోని అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, అనుభవజ్ఞులైన నిపుణుల ఆధ్వర్యంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నామని అన్నారు. డయాలసిస్ రోగులకు మరింత సౌకర్యవంతమైన సేవలను అందించే లక్ష్యంతో అత్యాధునిక డయాలసిస్ యూనిట్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు డాక్టర్ సరిత తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించడంలో కామినేని హాస్పిటల్స్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *