దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వెల్డింగ్ మెషిన్ పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలో విద్య, వైద్య, ఉపాధి కల్పన రంగాలలో దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్టు తూర్పు నియోజకవర్గ వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. సోమవారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్ నిరుపేద కుటుంబానికి చెందిన కత్తి అశోక్ కి జీవనోపాధి నిమిత్తం దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాదాపు 30,000 రూపాయల విలువ గల వెల్డింగ్ మిషన్, డ్రిల్లింగ్ మిషన్ కిట్స్ ని అవినాష్ స్థానిక కార్పొరేటర్ రెహేన నాహిద్ తో అందజేశారు.
ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ నాన్న స్పూర్తితో నిరుపేదలకు అండగా ఉండాలనే ఆయన ఆశయసాధనకు ట్రస్ట్ ద్వారా సేవ కార్యక్రమాలు చేపడుతున్నాం అని, నిరుపేదల జీవనోపాధి నిమిత్తం వారికి విద్య,వైద్య ఆర్థికం గా వారికి అవసరమైన విధంగా చేస్తున్నాం. అలాగే కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా నిత్యాన్నదానం, పరిసరాల పరిశుభ్రత,సోడియం హైపో క్లోరైడ్ పిచికారీ తదితర కార్యక్రమాలు నగర వ్యాప్తంగా చేసినట్లు గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో 22వ డివిజన్ కార్పొరేటర్ తాటిపర్తి కొండారెడ్డి,3వ డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గల్లా రవి, సొంగ రాజ్ కమల్, బచ్చు మురళిలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *