విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. సోమవారం 17వ డివిజన్, గుడ్ మార్నింగ్ టీ స్టాల్ దగ్గర, ఫిడర్ రోడ్డు వద్ద 11లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నూతనంగా నిర్మించబోయే సైడ్ వాల్ నిర్మాణానికి డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి తో కలిసి శంకుస్థాపన చేసిన అవినాష్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల ముందు వర్షాల వలన ఇక్కడ సైడ్ వాల్ పడిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే నాడు ఇచ్చిన హామీ మేరకు నేడు శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం మాటలు చెప్పే ప్రభుత్వం కాదని పని చేసే ప్రభుత్వం అని,ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామని అన్నారు. వరద ముంపునకు శాశ్వత పరిష్కారం గా రిటైనింగ్ వాల్ నిర్మాణం త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పేదవారికి అండగా నిలుస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ సుజాత,22వ డివిజన్ కార్పొరేటర్ కొండారెడ్డి,గాంధీ కోపరటివ్ బ్యాంక్ డైరెక్టర్ జోగా రాజు,మాజీ డిప్యూటీ మేయర్ చెల్లారావు, వైసీపీ నాయకులు దామోదర్,తాజుద్దీన్,మొహిద్దిన్,బుచ్చిబాబు, చిన్న బుచ్చిబాబు, యాకోబు, డా.వెంకటేశ్వర్ రావు, మహిళ అధ్యక్షురాలు జయలక్ష్మీ,గీత కుమారి
దుర్గమ్మ,గిరిజ, చిన్నారి భులక్ష్మీ పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …