-మహిళలను గౌరవించడం మన బాధ్యత డిటిసి యం పురేంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే విధంగా జిల్లాలోని రవాణాశాఖ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగిణిలకు ప్రతి ఒక్కరు ఇవ్వాలని డిటిసి యం పురేంద్ర అన్నారు. స్థానిక బందర్ రోడ్డు లోని డిటిసి కార్యాలయంలో రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోన్2 ఆధ్వర్యంలో సోమవారంనాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా రవాణాశాఖలో పనిచేస్తున్న ఉద్యోగిణిలతో ఆటలు పాటలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీటీసీ యం పురేంద్ర ముఖ్య అతిధిగా పాల్గొని ఆయన మాట్లాడారు. ముందుగా ఈ కార్యక్రమానికి హాజరైన మహిళ ఉద్యోగులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలకు ఆయన తెలియజేశారు. డిటిసి మాట్లాడుతూ మహిళలు ఒకపక్క ఇంటి బాధ్యతలు మరోపక్క ఉద్యోగ బాధ్యతలు చేపడుతూనే సమాజంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్నారన్నారు. స్త్రీ లేనిదే ఈ సృష్టి లేదని అమ్మను ఏ విధంగా గౌరమేస్తామో అదేవిధంగా మనతో పాటు పని చేస్తున్న మహిళలను కూడా గౌరవించుకోవాలసిన బాధ్యత ఉందన్నారు. రవాణా శాఖలో పనిచేస్తున్న మహిళలకు ప్రత్యేక సెల్ ను కూడా ఏర్పాటు చేస్తానని, ఎవరికైనా కలిగిన ఇబ్బందులు తెలియజేస్తే వెంటనే స్పందించే విధంగా మహిళ సెల్ ను పర్యవేక్షిస్తామన్నారు. ఈనాడు మహిళలు ఉద్యోగాలకి పరిమితం కాకుండా రాజకీయాలలో కూడా ఎంతోమంది రాణించగలిగారన్నారు. ఆధునిక భారతదేశంలో మహిళలు రాష్ట్రపతిగా ప్రధానమంత్రిగా లోక్ సభ సభాపతిగా ప్రతిపక్ష నాయకురాలిగా ఇలా అనేక ముఖ్యమైన పదవులు చేపట్టారని ఆయన గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళాభ్యుదయానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన అన్నారు. రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోన్2 అధ్యక్షుడు యం రాజుబాబు మాట్లాడుతూ జిల్లా రవాణాశాఖలో మహిళలకు ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేసి, మహిళలకు అండగా నిలవడం అభినందనీయమన్నారు. మహిళలు ఇంటికే పరిమితం కాకుండా నేటి సమాజంలో ఉద్యోగినిగా, అధికారులుగా పనిచేస్తూ ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా విధులు నిర్వహిస్తున్నారని ఆయన కొనియాడారు. ఉద్యోగంలో ఎవరికి వారు తగ్గ స్థాయిలో పని చేస్తున్నప్పటికీ అందరిని ఒక కుటుంభంలా చూస్తున్న డిటిసి కి అభినందనలు తెలియజేసారు. అనంతరం డీటీసీ యం పురేంద్ర చేతుల మీదుగా ఆటల పాటల పోటీలలో ప్రథమ ద్వితీయ స్థానాలలో గెలుపొందిన మహిళలకు బహుమతులను అందజేశారు. జిల్లాలో పనిచేస్తున్న మహిళ ఉద్యోగులను డిటిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీవో మంగాదేవి, జగదీశ్వర్ రాజు, ఎ విజయ సారథి, మోటార్ వాహన తనిఖీ అధికారులు రాధిక దేవి, నారాయణ రాజు, రవాణాశాఖ ఉద్యోగుల సంఘం నాయకులు యం రాజుబాబు, పి విజయ,జి నాగమురళి, ఏవోలు పి కవిత, సిహెచ్ శ్రీనివాసరావు మరియు ఉద్యోగిణిలు, ఉద్యోగులు ఉన్నారు.