విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ సతీమణి విజయలక్ష్మి కేక్ కటింగ్ చేశారు. అనంతరం నగర కమిటీ సభ్యులకు పలువురు మహిళలకు శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా విజయ లక్ష్మి మాట్లాడుతూజనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మహిళా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్నారని మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర కమిటీ సభ్యులు సయ్యద్. మోబినా,పాల.రజని, దుర్గ రాణి, విజయ కుమారి , అలియా బేగం, డివిజన్ అధ్యక్షులు తిరుపతి అనూష , మల్లెపు విజయ లక్ద్మీ, జనసేన వీర మహిళలు యలమంచిలి.నందిని చౌదరి అనిత, తులసి, భాను తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
6.60 కోట్లతో నిర్మించనున్న జి.టి.యస్ పనులకు శంకుస్థాపన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో శాస్తీయ పద్దతిలో వ్యర్దాల నిర్వహణకు జి.టి.యస్ (గార్బేజ్ ట్రాన్స్ఫర్ సిస్టం) …