విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో పెండింగ్ పనులతో పాటు.. డివిజన్ పర్యటనలలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో ఇంజనీరింగ్, ట్రాన్స్ కో అధికారులతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు, వాటి ప్రగతిపై డివిజన్ ల వారీగా ఆరా తీశారు. వివిధ దశలలో ఉన్న పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తొలుత నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మంజూరైన 134 అదనపు తరగతి గదుల నిర్మాణం, నాడు – నేడు పనులపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం 14వ, 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పెండింగ్ పనుల గురించి ఆరా తీశారు. వివిధ ప్రాంతాల్లో పార్కుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు గురించి అధికారులతో మాట్లాడారు. ఆంధ్రరత్న పార్క్, గులాబీతోట పార్క్ వాకింగ్ ట్రాక్, దుర్గాపురం పార్క్ లో ఓపెన్ జిమ్ ఏర్పాటు, చిట్టూరి విశ్వేశ్వరరావు పార్క్ మరమ్మతులకు నిధులు మంజూరు అయినట్లు అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. పనులు త్వరితగతిన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దేవీనగర్ ట్రెండ్ సెట్ వద్ద మంజూరైన విద్యుత్ సబ్ స్టేషన్ పనులను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించుకునేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. మరోవైపు వేసవి దృష్ట్యా ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా శంకుస్థాపనలు జరిపిన పనులలో జాప్యం ఉండకూడన్నారు. టెండర్లు పూర్తయిన పనులను వెంటనే చేపట్టాలన్నారు. ఆయా డివిజన్ల కార్పొరేటర్ల సమన్వయంతో పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో ఇంజనీరింగ్ ఈఈ శ్రీనివాస్, డీఈలు గురునాథం, రామకృష్ణ, ఏఈలు మౌసమి, అరుణ్ కుమార్, పురుషోత్తం, ఎలక్ట్రికల్ డిఈ ఫణింద్ర కుమార్ పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …